Breaking News

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం: గ్రేడ్-1 సూపర్వైజర్ ఊర్మిళ రెడ్డి.

0 60

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం.

తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం.

గ్రేడ్-1 సూపర్వైజర్ ఊర్మిళ రెడ్డి.
అల్లూరి జిల్లా పాడేరు: డబ్బా పాలు వద్దు..తల్లి పాలే ముద్దని అంగన్వాడీ గ్రేడ్-1 సూపర్వైజర్ ఊర్మిళ రెడ్డి అన్నారు.తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా శుక్రవారం పి.గొందూరు,ఎంకే వీధి,గుడివాడ, చాకిలపేట,పాత పాడేరు,కొత్త పాడేరు,సుండ్రుపుట్టు,లోచలిపుట్టు, ముల్లుమట్ట,జి.కాలనీ అంగన్వాడి సెంటర్లల్లో పిల్లల తల్లులతో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఊర్మిళ మాట్లాడుతూ తల్లి పాల విశిష్టతను తెలిపేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు నెల మొదటి వారం రోజులు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారని, వాబా (వరల్డ్ అలైన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్షన్ ) సంస్థ పర్యవేక్షణలో డబ్ల్యూహెచ్,యూనిసెఫ్,బిపిఎస్ఐ వంటి అంతర్జాతీయ,జాతీయ సంస్థల అనుబంధంగా జరుపుతున్నారన్నారు.పిల్లలకు తల్లిపాలు ఇవ్వకుంటే భవిష్యత్తులో పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.నవజాత శిశువులకు తల్లిపాలు అమృత తుల్యమైనవని,ప్రకృతి ప్రసాదించిన అత్యత్తుమ పౌష్టికాహారం తల్లి పాలే అని,సంపూర్ణ ఆరోగ్యంగా పుట్టిన పిల్లలకు వెంటనే తల్లిపాలు ఇవ్వడం తప్పనిసరి అన్నారు.తల్లిపాలు బిడ్డకు అమృతం,సురక్షితం.. పౌష్టికాహారం అని అన్ని పోషకాలు అందించి బిడ్డను రోగాల నుంచి రక్షించే ఔషధమన్నారు.పోతపాల కంటే తల్లిపాలు తాగే పిల్లలు బలంగా, తెలివిగా ఉంటారన్నారు.శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో,వజ్రసమానమైన రోగనిరోధక శక్తిని పొందాలంటే తల్లిపాలు పట్టించాల్సిందే అన్నారు. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటి నుంచి 7వ తేదీ వరకు అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు.ఈ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి అంగన్వాడి టీచర్లు,ఆయాలు,పిల్లల తల్లులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.