Breaking News

వ్యవసాయ పనిముట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పాడేరు ఎమ్మెల్యే, ఐటిడిఏ పిఓ

0 20

 వ్యవసాయ సంబంధిత పనిముట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి, ఐటిడిఏ పిఓ అభిషేక్.

ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం లోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో వాటర్ షెడ్ డిపార్ట్మెంట్ వారి ద్వారా మండలంలోని కొయ్యూరు,మంప,రేవళ్ళు,మర్రివాడ, రావణాపల్లి పంచాయితీల రైతులకు వ్యవసాయ సంబంధిత పనిముట్లు పంపిణీ కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి,పాడేరు ఐటిడిఏ పిఓ అభిషేక్ పాల్గొని రైతులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే,పీఓ మాట్లాడుతూ..90% సబ్సిడీతో ఈ వ్యవసాయ పనిముట్లు రైతులకు అందించడం హర్షించదగ్గ విషయమని, వ్యవసాయ పనిముట్లు తీసుకొనే రైతులు అందరూ పనిముట్లను సద్వినియోగం చేసుకోవాలని, వ్యవసాయంలో బాగా లాభసాటిగా రాణించాలని అన్నారు.వ్యవసాయ పనిముట్లు ఎవరూ అమ్ముకోవద్దని,ఆరు నెలలు తరువాత మీ దగ్గర ఈ పనిముట్లు ఉన్నాయా లేదోనని పరిశీలించేందుకు వాటర్ షెడ్ అధికారులు వచ్చి పరిశీలించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్, జెడ్పిటిసి వారా నూకరాజు, చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు, వైస్ ఎంపీపీ లు అప్పన వెంకటరమణ, అంబటి నూకాలమ్మ, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గాడి నాగమణి,డ్వామా పీడీ గిరి,వాటర్ షెడ్ పీవో శంకర్, అగ్రికల్చర్ ఏవో ఉమాదేవి, కొయ్యూరు ఎంపీటీసీ మల్లికార్జునరావు,మండల నాయకులు గాడి సత్యనారాయణ, బండి సుధాకర్, పాటి శేఖర్, తిరుపతి రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.