Breaking News

రాయలసీమ గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదు: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

0 41

రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రెస్‌మీట్‌:

రాయలసీమ గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదు.

నువ్వు పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు పేరైనా చెప్పగలవా..?

సీమప్రాంత నీటివాటా దక్కనీయని దుర్మార్గుడు బాబు.

ఆయన హయాంలో ఏ ఒక్క ప్రాజెక్టు చేపట్టలేదు.

పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా ధర్నా చేయించిన దరిద్రుడు బాబు:ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి వెల్లడి.

సీమ అభివృద్ధికి పనిచేసింది మహానేత వైయస్సార్‌.. జగనే.

హంద్రీ నీవా,గాలేరు నగరి పూర్తి వైయస్సార్‌ పుణ్యమే.

ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల రూపకర్త ఆయనే.

ఫ్రస్టేషన్‌ తో ఊగుతూ వాగుతున్న చంద్రబాబు.

సీనియర్‌నని చెప్పుకుంటూ హూందాతనం కోల్పోతున్నాడు.

ఆయన బెదిరింపులకు భయపడే కాలం చెల్లిందని తెలుసుకోవాలి.

అబద్ధాలతో సీమప్రజలను మభ్యపెట్టలేరు

బాబుకి శాశ్వత రాజకీయ సమాధి చేసేందుకు ప్రజల ఎదురుచూపు.

-తేల్చి చెప్పిన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి.

రాయచోటి: ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..

ఫ్రస్టేషన్‌లో చంద్రబాబు:

రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవమే ముఖ్యంకాదు. క్రమశిక్షణ, హూందాతనం చాలా ముఖ్యం. చంద్రబాబులో అవి పూర్తిగా లోపించినట్లు కనిపిస్తున్నాయి. ఆయన అధికారంలో లేడనే ఫ్రస్టేషన్‌ అనేది అతని మాటల్లోనే స్పష్టమౌతుంది. రాజకీయాల్లో పదవే నాకు ముఖ్యం. అందుకోసం ఎంతకైనా దిగజారుతాననే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు. నిన్న రాయలసీమలో ఆయన మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. రాయలసీమ ప్రజలకు తానే అన్నం తినిపించినట్లు.. అంతకుముందు ఇక్కడ ప్రజలు అన్నమే తినేవారు కాదన్నట్లు మాట్లాడాడు. బాబు సుదీర్ఘ ప్రసంగంలో ఆయన సిగ్గులేనితనాన్ని ప్రజలు నిన్న అర్ధం చేసుకున్నారు.

ఇరిగేషన్‌పై అవగాహనలేని నేత:

ఇరిగేషన్‌ రంగంలో ఎంతో చేశానంటున్న చంద్రబాబు, రాయలసీమ వాసులకు ఏమీ తెలియదని అనుకుంటున్నాడు. అందుకే వారిని మాయ మాటలతో మభ్య పెట్టాలని చూస్తున్నాడు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులను నేనే తెచ్చానంటూ బాబు బిల్డప్‌లు ఇచ్చాడు. నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఇరిగేషన్‌పై నీకున్న అవగాహన ఎంత..? ఆ అవగాహనతో రాయలసీమలో ఎన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశావు..? ఎన్నింటిని పూర్తిచేసి ప్రారంభోత్సవం చేశావు..? ఇందుకు సమాధానం చెప్పే దమ్మూధైర్యం ఉందా..? అని నిలదీస్తున్నాను.

హంద్రీనీవా, గాలేరు నగరిపై ఎన్టీఆర్‌ సంకల్పాన్ని చంపేశాడు:

నాడు ఎన్టీఆర్‌ గాలేరు-నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులకు కేవలం పేర్లు మాత్రమే పెట్టాడు. కానీ పనులేవీ చేయలేదు. అయినా ఆయన సంకల్పాన్ని, ఆలోచనను మేము మెచ్చుతాం. అదే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, పార్టీని, పదవిని లాక్కున్న చంద్రబాబు.. అధికారం చేపట్టిన తర్వాత ఎన్టీఆర్‌ సంకల్పాన్ని చంపేసి ఆ ప్రాజెక్టులపై చేసిందేమీ లేదు. కానీ సీమ ప్రజలను మోసగించే ఎత్తుగడలో భాగంగా ఉరవకొండ దగ్గర 40 టీఎంసీల నీటికి సంబంధించి హంద్రీనీవాకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1999లో అక్కడ 40 టీఎంసీల సామర్థ్యం కుదరదంటూ.. కేవలం 5 టీఎంసీల ప్రాజెక్టు చేపడతామంటూ జీఓ జారీ చేసి.. మరోసారి శంకుస్థాపన చేశారు. కానీ 2004 వరకు కనీసం పనులు కూడా మొదలు పెట్టలేదు. చివరకు శిలాఫలకం వేసిన వారికి కూడా డబ్బులివ్వలేదు. అదీ హంద్రీనీవాకు సంబంధించి చంద్రబాబు ఘనత.

గాలేరు – నగరిపై బాబుకు శ్రద్ధేలేదు:

ఇక గాలేరు–నగరిపై కూడా ఏ మాత్రం శ్రద్ధ చూపకపోగా, గండికోట రిజర్వాయర్‌ ఉండగా.. అక్కడ కేవలం 3 టీఎంసీ సామర్ధ్యం ప్రాజెక్టు సరిపోతుందని జీవో ఇచ్చాడు. అలాంటి పెద్దమనిషి ఇవాళ రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాడు. ఇరిగేషన్‌పై ఉత్త కబుర్లు చెబుతున్నాడు.

హంద్రీనీవా, గాలేరు నగరి వైయస్సార్‌ పుణ్యమే:

2004లో నాడు ఉమ్మడి రాష్ట్రంలో సీఎం అయిన మహానేత వైయస్సార్‌గారు హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేశారు. అక్కడ 5 టీఎంసీల ప్రాజెక్టుపై చంద్రబాబు జారీ చేసిన జీఓను రద్దు చేసిన ఆయన, అక్కడే పనులు చేపట్టి పూర్తి చేశారు. అదే విధంగా గాలేరు–నగరి ప్రాజెక్టులో మొదటి విడత పనులు వైయస్సార్‌గారి హయాంలో యుద్ధప్రాతిపదికన జరిగాయి.

పోతిరెడ్డిపాడును ఒకటిన్నర ఏళ్లలోనే:

రాయలసీమ ప్రజలు గర్వంగా చెప్పుకునే పోతిరెడ్డిపాడు రిజర్వాయర్‌ను గతంలో విజయభాస్కర్‌రెడ్డిగారు సీఎంగా ఉన్నప్పుడు 11వేల క్యూసెక్కుల స్థాయిలో శంకుస్థాపన చేస్తే.. దాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచడమే కాకుండా.. కేవలం ఒకటిన్నరేళ్లలోనే ఆ పనులు పూర్తి చేసిన మహానేత వైయస్సార్‌గారు రికార్డు సృష్టించారు. పులివెందులలో నిర్మించిన ప్రాజెక్టులు కానీ, రాయలసీమలో పలు ఇరిగేషన్‌ ప్రాజెక్టులు కానీ, హంద్రీనీవాపై నిర్మించిన జీడిపల్లి, గొల్లపల్లి, శ్రీనివాసపురం, అడివిపల్లి రిజర్వాయర్లు కానీ.. అవన్నీ వైయస్సార్‌గారి ఘనతని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం. అవన్నీ ఆయన హయాంలోనే పూర్తయ్యాయి. 2011లోనే జీడిపల్లికి నీళ్లొచ్చాయి. గొల్లపల్లి రిజర్వాయర్‌ పూర్తి కావడం వల్లనే అక్కడ కియా ఫ్యాక్టరీ ఏర్పాటైంది. సీమలో పలు ప్రాజెక్టులు పూర్తి కావడం వల్ల, వేల టన్నుల కూరగాయలు పండించి వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.

కన్నార్పకుండా అబద్ధాలాడటంలో నేర్పరి బాబు:

కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించిన నాయకుడు లేడు. నిజాయితీ లేనటువంటి మాటలను అప్పటికప్పుడు అల్లి చెప్పడం చంద్రబాబు నైజం. రాయలసీమ అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంటే, తానే ఎక్కువ చేశానని చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏ మాత్రమైనా సిగ్గుందా? 14 ఏళ్లు సీఎంగా పని చేసిన విషయాన్ని, మూడు సార్లు అధికారం నుంచి దిగిపోయానన్న సంగతినీ మర్చిపోయి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతానికి ఏమీ చేయకపోయినా.. తాను ఎన్నో చేద్దామనుకున్నానని, అంతలోనే అధికారం నుంచి దిగిపోయానని సిగ్గు లేకుండా చెబుతున్నాడు.

వ్యవసాయం దండగమారిదన్నది బాబే:

వ్యవసాయం దండగ అనడమే కాకుండా, ఆ విషయాన్ని మనసులో మాట పుస్తకంలో కూడా రాసిన వ్యక్తి.. ఈరోజు వ్యవసాయం గురించి మాట్లాడడం అనేది ఒక కామెడీగా ఉంది. రాయలసీమలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రైతులతో ప్రకాశం బ్యారేజీపై ధర్నా చేయించిన చంద్రబాబు, ఈరోజు ఇరిగేషన్‌పై మాట్లాడడం హాస్యాస్పదం.

సాగునీటి ప్రాజెక్టుల పేరెత్తితేనే వైఎస్‌ఆర్‌ కుటుంబం గుర్తుకొస్తుంది:

ఉత్తరాంధ్రకు సంబంధించి జంఝావతి, మహేంద్రతనయ ప్రాజెక్టు మొదలు.. తూర్పు గోదావరి జిల్లాల్లో తాడిపూడి, పుష్కర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ వరకు.. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య పులిచింతల, ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ ప్రాజెక్టు కూడా మహానేత డాక్టర్‌ శ్రీ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పూర్తి చేశారు. అలా రాష్ట్రంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత వైయస్సార్‌గారి కుటుంబానికి దక్కుతుంది.

జగన్‌ సంకల్పం ఇది:

రాయలసీమకే గుండెకాయ వంటిది గండికోట రిజర్వాయర్‌. అలాంటి రిజర్వాయర్‌పై చంద్రబాబు ఏమాత్రం శ్రద్ధ చూపకపోతే, ఈరోజు దాన్ని 27 టీఎంసీలతో నింపుకునే సామర్థ్యాన్ని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ కల్పించారు. అక్కడి రైతుల్ని ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీతో నచ్చచెప్పి రిజర్వాయర్‌ సామర్ధ్యం పెంచుకున్న గొప్ప ఆలోచన జగన్‌గారిది. ఆనాడు మహానేత వైయస్సార్‌ రూపకల్పన చేసి ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల సామర్ధ్యం పెంచేందుకు ముందుకుపోయే ప్రణాళికలో జగన్‌గారు చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. హంద్రీనీవా కెపాసిటీ పెంచడంతో పాటు, డిజైన్లు కూడా ఇప్పటికే అప్రూవ్‌ చేశారు. చిత్తూరు పశ్చిమ ప్రాంతాలకు, రాయచోటి, చక్రాయపేట వంటి ప్రాంతాలకు నీళ్లు ఇచ్చేందుకు గండికోట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి సోమశిల ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత జగన్‌గారికి దక్కుతుంది.

సీమ గురించి బాబుకు మాట్లాడే హక్కే లేదు:

రాయలసీమ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. 1995లో అధికారపగ్గాలు చేపట్టిన దగ్గర్నుంచి హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టు పనులు చేపట్టకపోగా, పోతిరెడ్డిపాడు పనులు చేస్తుంటే బాబు వ్యతిరేక భావాలతో కొందరిని రెచ్చగొట్టి నిరసన కార్యక్రమాలు చేయించాడు. అంత నీచమైన స్వభావమున్న బాబు ఈరోజు రాయలసీమ అభివృద్ధి, ప్రాజెక్టులపై మాట్లాడటం ఆయన సిగ్గుమాలినతనానికి నిదర్శనం. బాబుకు తెలిసిందల్లా ఒక్కటే.. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా అక్కడకెళ్లి రాయలసీమ రౌడీలు, రాయలసీమ ఫ్యాక్షనిస్టులు అనడమే బాబుకు తెలుసు తప్ప, ఏరోజు కూడా రాయలసీమ ప్రజలకు మంచి చేయడం చేత కాలేదు. ఎయిమ్స్‌లాంటి ఆస్పత్రి అనంతపురానికి వస్తే, దాన్ని వేరే చోటికి మార్చిన వ్యక్తి చంద్రబాబు.1995 నుంచి 1999 వరకు అధికారంలో ఉన్న నువ్వు గాలేరు నగరి, హంద్రీనీవా పూర్తి చేసి ఉంటే.. 2004లో ఏర్పడిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌తో రాయలసీమ నీటి వాటా వచ్చేది కదా? మరి, బాబు అప్పట్లో ఎందుకు ఆలా ఆలోచించలేకపోయాడని ప్రశ్నిస్తున్నాను. కేవలం, బాబు చేతగాని తనంతోనే రాయలసీమ నీటివాటాను వదులుకోవాల్సి వచ్చింది. 14 ఏళ్లలో బాబు హయాంలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా తాను స్వయంగా రూపకల్పన చేసి పూర్తిచేసిన దాఖలాల్లేవు. నీ హయాంలో కరువు తాండవిస్తే పశువులకు గడ్డిని క్యాంపుల ద్వారా అందించానని చెప్పుకుంటున్నావు. అంటే, నీ పాలన అంత దరిద్రంగా ఉండేదన్న మాట

పోలవరంపై బాబు డబ్బా కూతలు:

పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకువస్తుంటే..దానికి అడుగడుగునా ఆటంకాలు సృష్టించిన దుర్మార్గుడు ఈ చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వమే పూర్తిచేయాల్సిన పోలవరం ప్రాజెక్టును వారి భుజాల మీద నుంచి తాను తీసుకుని కమిషన్లు దండుకుంటూ.. కేంద్రం ఇచ్చిన నిధుల్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు. పోలవరంను ఏటీఎంగా మార్చుకున్నారని బాబు ప్రభుత్వంపై ఆనాడు కేంద్రమే బహిరంగంగా చెప్పిన విషయం అందరికీ తెలుసుకదా..?

మహానేత వైయస్‌ఆర్‌ గారి గొప్పతనం తెలుసుకో బాబు:

మహానేత వైయస్‌ఆర్‌ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక అనేక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలను తెచ్చారు. ఆరోగ్యశ్రీ పథకంతో రాష్ట్రంలో లక్షలాదిమంది ఆపరేషన్లు చేయించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు. ఈరోజు రాయలసీమ జిల్లాల్లో ప్రతీ ఇంట ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా తయారై పెద్దపెద్ద కంపెనీల్లో పనిచేస్తున్నారంటే, అది వైయస్‌ఆర్‌ గారు ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్‌ వల్లనే అనే సంగతి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. మరి, అలాంటి కార్యక్రమాన్ని నీవు గానీ, నీ పార్టీ పుట్టినప్పుడు గానీ మీరు చేశారా చంద్రబాబు ..? అని అడుగుతున్నాను. రైతు కుదేలైపోయిన రోజుల్లో ఉచిత విద్యుత్‌ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకున్న ఘనత మహానేత దివంగత మహానేత వైయస్‌ఆర్‌కే దక్కుతుంది.

సంస్కారం లేని హీనమైన నేత చంద్రబాబు:

ఆదినుంచి రౌడీయిజం ప్రోత్సహించిన చరిత్ర చంద్రబాబుది. రాయలసీమ ప్రజలంతా ఫ్యాక్షనిస్టులని దుష్ప్రచారం చేసిన నీచుడు ఆయన. అన్నివిధాలుగా రాయలసీమను నాశనం చేసి .. ఈరోజు తగుదునమ్మా అంటూ పులివెందులకొచ్చి మాట్లాడుతున్నావా బాబూ..? నీ హూంకరింపులకు, బెదిరింపులకు ఇక్కడ భయపడేదెవరూ లేరు. వివేకానందరెడ్డి గారిని హత్యచేశానని ఒప్పుకున్న దస్తగిరిలాంటి వాళ్లను చంద్రబాబు పొగుడుతున్నాడంటే.. అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు. ఏ తప్పు చేయకపోయినా నీ కుట్ర కుతంత్రాలతో మా నాయకుడిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నావు. బాబు ఎన్ని అభూతకల్పనల్ని సృష్టించి రాయలసీమ ప్రజల్ని తప్పుదోవపట్టించే ప్రయత్నాలేమీ ఫలించవు. ఇప్పటిదాకా మా ప్రభుత్వంపై నువ్వు చేసిన దుర్మార్గపు ఆరోపణలు, విమర్శలకు సంబంధించి తప్పకుండా మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరిస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో నిన్ను చిత్తుచిత్తుగా ఓడించి శాశ్వతంగా రాజకీయ సమాధికట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

Leave A Reply

Your email address will not be published.