Breaking News

కిష్టారం ఎంపీపీ స్కూల్లో అసలేం జరుగుతుంది?.

0 929

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం ఆడాకుల పంచాయితీ కిష్టారం గ్రామంలో ఉన్న ఎంపీపీ స్కూల్ నందు నిర్వాకం.

పాఠశాలలో 30మంది విద్యార్థులు.

30 మంది విద్యార్థులకు వంట చేసేందుకు ఇద్దరు ఆయాలు.

ఇద్దరిలో ఏ ఆయాను కొనసాగించాలో అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉన్న ఇద్దరు టీచర్లు.

వివరాలు చూసినట్లయితే కిష్ఠారం ఎంపీపీ స్కూల్ లో చెల్లాయమ్మ అనే ఆమె గత 24 సంవత్సరాలుగా ఆయా గా ఉంటూ పిల్లలకు వంట చేస్తున్నానని,

ఆమెకు కనీసం సమాచారం ఇవ్వకుండా, స్కూల్ కమిటీ అలాగే పిల్లల తల్లిదండ్రుల సమక్షంలో ఎటువంటి మీటింగ్ కూడా పెట్టకుండా,ఎవరికీ తెలియజేయకుండా ఎడం రాజులమ్మ అనే ఆమెను నూతన ఆయాగా నియమించి.. గతంలో కొయ్యూరు మండలంలో విధులు నిర్వహించిన ఎంఈఓ ఆయాగా ఉన్న తన పేరును తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది.

పాఠశాలలో ఉన్న తీర్మానం బుక్ లో మాత్రం చెల్లాయమ్మ అనే ఆమెను ఆయా గా తొలగించి రాజులమ్మ అనే ఆమెను నూతన ఆయాగా నియమిస్తున్నట్లు పేర్కొని వుంది.

అలాగే కొంతమంది సంతకాలు కూడా చేసినట్లుగా అందులో ఉంది.
అయితే ఈ సందర్భంగా స్కూల్ కమిటీ వైస్ చైర్మన్, విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం చెల్లాయమ్మను ఆయాగా తొలగించి రాజులమ్మ ను నూతన ఆయా గా నియమించేందుకు ఎటువంటి సమావేశం నిర్వహించలేదని,తీర్మానం కూడా చేయలేదని చెప్పారు.

ఎటువంటి సమావేశం నిర్వహించకుండా తీర్మానం బుక్ లో దొంగ సంతకాలు చేశారని వారు తెలిపారు.

ఇదిలా ఉండగా ఎడం రాజులమ్మ అనే ఆమెను నూతన ఆయాగా కొనసాగించాలని రాజులమ్మ పేరుతో ఆర్డర్ కాపీ కూడా పాఠశాలలో ఉండటం గమనార్హం.

అయితే ఈ తప్పిదానికి కారకులెవరు?

30 మంది విద్యార్థులకు నేనంటే నేను తగ్గేదేలే అన్నట్లు పిల్లల కోసం చెల్లాయమ్మ వంట చేస్తుంది.. మరోవైపు రాజులమ్మ కూడా తన ఇంటి వద్ద వంట చేయడం జరుగుతుంది.

అసలు జిల్లాలోనే కాదు..రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా కిష్టారం ఎంపీపీ స్కూల్లో జరుగుతుంది.

పిల్లల కోసం వంట చేసేందుకు సరుకులు ఎవరికి ఇవ్వాలో అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఇద్దరు టీచర్లు డైలమాలో పడ్డారు.
చెల్లాయమ్మ వండిన వంట ఒకవైపు, రాజులమ్మ వండిన వంట మరొకవైపు పెట్టుకొని పిల్లలకు మధ్యాహ్న భోజనం వడ్డించారు.

ఎవరు వండిన అన్నం తినాలో తెలియక విద్యార్థులు రెండు చోట్ల రెండు లైన్లు కట్టి అన్నం వడ్డించుకుని తిన్నారు.

అయితే పాఠశాలలో ఉన్నదే 30 మంది విద్యార్థులు. దానికి తోడు అదనంగా మరొక 15 మంది విద్యార్థులకు సరిపడా భోజనం మిగిలిపోయింది.

గతంలో ఆ పాఠశాలలో పనిచేసిన హెచ్ఎం తప్పిదమో,లేక ఎంఈఓ తప్పిదమో తెలీదు కానీ సమాధానం లేని ప్రశ్నలా ఆ పాఠశాలలో ఉంది.

ఎటువంటి సమాచారంగానీ, తీర్మానంగానీ చేయకుండా చెల్లాయమ్మ ను ఆయాగా తొలగించడందేనికని పాఠశాల కమిటీ వైస్ చైర్మన్, అలాగే పిల్లల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
మరికొంత పూర్తి సమాచారం గ్రామస్తులను అడగగా ఆయా పోస్ట్ విషయమై రెండు సంవత్సరాలుగా గొడవ జరుగుతూనే ఉందని గ్రామస్తులు తెలిపారు.

జిల్లాస్థాయి అధికారులు స్పందిస్తే తప్ప ఈ సమస్య ఒక కొలిక్కి రాదు అనేది మీ మాంసగా మిగిలిపోయింది.
మరి అధికారులు ఏం చేస్తారో వేచి చూడాలి.

Leave A Reply

Your email address will not be published.