Breaking News

మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కి వైసిపి నాయకులు రీ కౌంటర్.

0 595


అల్లూరి జిల్లా పాడేరులో ఆదివారం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ప్రెస్ మీట్ లో టిడిపి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ వైసీపీ పరిపాలనలో దోచుకో..దాచుకో అనే రీతిలో ఉందని,రాష్ట్రంలో ప్రాజెక్టులు పడకేసాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు అంశాలు మాట్లాడారు.ఆమె మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఈరోజు కొయ్యూరులో వైసిపి పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు ధోని బాబ్జి,చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ జైతి రాజులమ్మ,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ త్రిమూర్తి,మండల నాయకుడు కొర్రా తిరుపతిరావు ఘాటుగా స్పందించారు. దోచుకో..దాచుకో..అనే పదాలు మీకే వర్తిస్తాయని రీ కౌంటర్ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.