అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, రావణాపల్లి సచివాలయం పరిధిలోని నల్లగొండ,తోటలూరు,రేవడవీధి గ్రామాల్లో ‘జగనన్న సురక్ష’ సర్వే నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి ‘జగనన్న సురక్ష’ ప్రోగ్రాం ద్వారా ప్రజలకు అందించనున్న పలు అంశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి చింతపల్లి ఏఎంసి చైర్పర్సన్ జైతి రాజులమ్మ, ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ‘జగనన్న సురక్ష’అనే ప్రోగ్రాం ద్వారా కుల, ఆదాయం దృవీకరణ పత్రాలు,బర్త్ సర్టిఫికేట్,ఆధార్ అప్డేట్, మ్యుటేషన్, మ్యారేజ్ సర్టిఫికెట్ తదితర సర్టిఫికేట్ లు సచివాలయంలో ఫ్రీ గా ఇవ్వడం జరుగుతుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగధీశ్వరి,సచివాలయ కన్వీనర్ నాగేంద్ర,గృహ సారధులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
Related Posts