Breaking News

వచ్చే నెల ఆగష్టు 3న రాష్ట్ర మన్యం బంద్ విజయవంతం చేయండి: ఆదివాసి సంఘాలు.

0 167

అల్లూరి సీతారామరాజు జిల్లా: మణిపూర్ ఆదివాసులపై జరుగుతున్న దాడులు అఘాయిత్యాలు, అత్యాచారాలు,ఆదివాసీ మహిళలను నగ్నంగా రోడ్డుపై ఊరేగింపులకు వ్యతిరేకంగా వచ్చే నెల ఆగస్టు 3న ఆంధ్రప్రదేశ్ మన్యం రాష్ట్ర బంద్ విజయవంతం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం,దండకారణ్య విమోచన సమితి,అనుబంధ సంఘాలు,ఆదివాసీ గిరిజన మహిళా సంఘం,సీఐటీయూ,ఎస్ఎఫ్ఐ,గిరిజన సమాఖ్య,ఏఐఎస్ఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో పిలుపు ఇవ్వడం జరిగింది.
మణిపూర్ ఆదివాసులపై జరుగుతున్న హింసలో 160 మంది ఆదివాసులు మరణించారని,500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని,10వేల ఇళ్లులు ధ్వంసం చేశారని,60 వేల మంది ఆదివాసులు పునారవాస కేంద్రాల్లో ప్రాణాలు అరచేతులో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారని, 1200 చర్చీలు ఇళ్లను తగలబెట్టి వందల కోట్ల ఆస్తులు నష్టం కలగజేసారని,తక్షణమే మణిపూర్ లో కుకి,నాగ తెగల ఆదివాసులకు వారి ఆస్తులకు రక్షణ కల్పించాలని,పార్లమెంట్ లో ఆమోదించిన అటవీ పర్యావరణ సవరణ చట్టం రద్దు చేయాలని,
ఆంధ్ర రాష్ట్రంలో రద్దు చేసిన జీవో నెంబర్ 3 చట్టబద్ధత కల్పించి ఆదివాసులకు నూరు శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని,రాష్ట్ర ప్రభుత్వం బోయ వాల్మీకి లకు ఎస్టీ జాబితాలో చేరుస్తామన్న అసెంబ్లీ తీర్మానం తక్షణమే రద్దు చేయాలని,పోలవరం వరద బాధితులకు పునరావాసం కేంద్రాలు కల్పించి తక్షణ సహాయ సహకారాలు అందించాలని,నిర్వాసితులకు శాశ్వత పునరావాసం కల్పించాలని,నాన్ షెడ్యూల్డ్ ఆదివాసి గ్రామాలను షెడ్యూల్డ్ గ్రామాల్లో కలపాలని..చింతపల్లి, అనంతగిరి మండలాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్ జరుగుతుందని,ఈ బంద్ లో ఉద్యోగ, ఉపాధ్యాయ,కార్మిక,ప్రజా సంఘాలు,వర్తకులు,ఆదివాసి ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర,జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలదేవ్,అధ్యక్షులు ధర్మన్న పడాల్,ఉపాధ్యక్షులు సుందర్రావు,నరసయ్య,దండకారణ్య విమోచన సమితి రాష్ట్ర అధ్యక్షులు తెలమల రంజిత్,రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శ్రీనివాస్,ఆదివాసి గిరిజన మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.హైమావతి,సిఐటియు జిల్లా నాయకురాలు దాసమ్మ,మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కె.మాణిక్యం,గిరిజన సమాఖ్య,ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.