మిగిలిపోయిన అర్హులకూ పథకాలు.
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి .
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంతృప్తికర స్థాయిలో సంక్షేమ పాలన అందిస్తున్నారని, ఎవరైనా అర్హులు మిగిలిపోతే వారికి కూడా పథకాలు అందిస్తామని పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు.అల్లూరి జిల్లా, చింతపల్లి మండలం అన్నవరం గ్రామ సచివాలయం పరిధిలోని కూర్మనపాకలు,కొత్తూరు బయలు,గాలిపాడు, అన్నవరం గ్రామాలలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామంలో ఎమ్మెల్యే కి ఆయా గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి 252 గడపలను సందర్శించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. అర్హత ఉండి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందని వారు ‘జగనన్న సురక్ష’ కార్యక్రమంలో తెలియజేస్తే ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తారని తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోవడం జరుగుతుందని, ఆ సమస్యలకు వెనువెంటనే పరిష్కారం కూడా చూపుతున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన సంక్షేమమే లక్ష్యంగా పాలనను అందిస్తూ…. జన బాంధవుడుగా ప్రజల నుంచి మన్ననలు పొందుతున్నారన్నారు. ఒకపక్క సంక్షేమానికి ప్రాధాన్యతినిస్తూనే మరోపక్క మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతినిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల ఆర్థిక సామర్థ్యాలు పెరుగుతున్నాయన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వలన ప్రజల జీవన ప్రమాణాల్లో స్పష్టమైన మార్పు వచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అన్నవరం సర్పంచ్ పాంగి సన్యాసిరావు, స్థానిక ఎంపీటీసీ కొర్రా సూరిబాబు,గ్రామ పెద్దలు వంతల రామరాజు, ఎంపీపీ కోరాబా అనూష దేవి,వైస్ ఎంపీపీ గోపి నాయక్ శారదా,జడ్పిటిసి పోతురాజు బాలయ్య పడాల్,మండల అధ్యక్షులు మోరి రవి, మండల కన్వీనర్ పాంగి గుణ బాబు, చౌడపల్లి సర్పంచ్ లలితా కుమారి, ఎంపీటీసీలు మఠం రాజులమ్మ, మీనా కుమారి, ఎంపీటీసీ మోహన్ రావు, నాయకులు బెన్ని బాబు బొజ్జన దొర, సోషల్ మీడియా కన్వీనర్ కురసా తిరుపతి, తాజాంటా వైస్ సర్పంచ్ గెమ్మెల రవి, నాయకులు వంతల వినీత్, చంటి ,ఎంపిటిసి పాంగి బాబురావు, కో ఆప్షన్ సభ్యులు నాజర్ వలీ, మండల అధికారులు,సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.