రాష్ట్రంలో పడకేసిన ప్రాజెక్టులు.
వైకాపా పరిపాలనలో దోచుకో దాచుకో.
కోస్తాంధ్రలో టిడిపి హయంలో ప్రాజెక్టులపై 21,442 కోట్లు ఖర్చు.
నాలుగేళ్లలో వైకాపా ఖర్చు రూ4,375 కోట్లు.
ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయి.
గిరిజన ప్రాంతంలో చెరువులు,చెక్ డాములు కట్టిన ఘనుడు చంద్రబాబు.
ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ఆగస్టు నుండి దశలవారీగా ఉద్యమం చేపడుతాం.
-పాడేరు నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.
అల్లూరి జిల్లా,పాడేరు: రాష్ట్రంలో పడకేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయి ప్రజాద్రోహి జగన్మోహన్ రెడ్డి అని పాడేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఆదివారం పాడేరు మండలం కుమ్మరిపుట్టు ఆమె నివాస గృహమందు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ..వైకాపా పరిపాలనలో దోచుకో దాచుకో అనే పరిపాలన కొనసాగిస్తున్నారని 2014 నుండి 2019 వరకు పరిపాలించిన తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు 75% పూర్తి చేస్తే ఉన్న 30% కూడా ఈ నాలుగేళ్ల వైసిపి పరిపాలనలో పూర్తి చేయలేదు కదా ఉత్తరాంధ్రలో వైసిపి 40 వేల కోట్ల దోచేసిందని అన్నారు.కోస్తాంధ్రలో టిడిపి హయంలో ప్రాజెక్టులపై 21,442 కోట్లు ఖర్చు చేస్తే వైసిపి నాలుగేళ్ల పరిపాలనలో 4,372 కోట్లే ఖర్చు చేసి 40,000 కోట్లు మింగేసిందన్నారు.ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో వర్షాధారపై ఆధారపడి గిరిజనులు వ్యవసాయం చేస్తూ ఉంటారు.2014 నుండి 2019 వరకు పరిపాలించిన తెలుగుదేశం ప్రభుత్వ నారా చంద్రబాబు నాయుడు చెరువులు,చెక్ డ్యాములు కట్టించి వ్యవసాయం చేసుకోవడానికి గిరిజనులకు అవకాశం కల్పించారని అన్నారు.ఈ నాలుగేళ్ల పరిపాలనలో ఎక్కడైనా వైసీపీ ప్రభుత్వంలో చెక్ డ్యామ్ లు కట్టించారా అని ప్రశ్నించారు.చింతపల్లి మండలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చెక్ డ్యాం నిర్మాణం చేపడితే వైకాపా ప్రభుత్వం వచ్చి అది నిలుపుదల చేసిందని అది నేటికీ పూర్తి కావడంలేదని అన్నారు.అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం పరిధిలో ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని లేని యెడల ఆగస్టు ఒకటి నుండి మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దశల వారీగా ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు.ఉత్తరాంధ్రలోని అన్ని నదుల అనుసంధాన ప్రక్రియ ఉత్తరాంధ్ర సృజల స్రవంతి అని అన్నారు.మొత్తం ఆయకట్టు ఎనిమిది లక్షల ఎకరాలు 30 లక్షల మందికి తాగునీరు టిడిపి హాయంలో 13 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు.వైసిపి 780 కోట్లు కేటాయించినట్లు పేపర్లో చూపించి అరకొరగా ఐదు కోట్లు ఖర్చు పెట్టారని,అతి ముఖ్యమైన ఈ ప్రాజెక్టుని ఇలా చేసినందుకు సిగ్గు లేదా అని ప్రశ్నించారు.ఇప్పటికైనా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ఉద్యమాలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి గబ్బాడ సింహాచలం,బుద్ధ జ్యోతి కిరణ్,కిండంగి బూత్ ఇంచార్జ్ రాజేష్ పాల్గొన్నారు.