ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పొట్టిక వెంకట లక్ష్మి మృతి..
సంతాపం వ్యక్తం చేసిన ఉపాధి హామీ సిబ్బంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పంచాయితీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్-2 పొట్టిక వెంకటలక్ష్మి రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందింది.ఈ విషయం తెలుసుకున్న ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది ఉదయం తమ స్వగ్రామమైన సోదరుడు గ్రామానికి వెళ్లి మృతి పట్ల విచారం వ్యక్తం చేసారు.
బుధవారం వారాంతపు మీటింగ్ లో పాల్గొన్న వెంకటలక్ష్మి మరణవార్త విని షాక్ కి గురయ్యాము అని ఉపాధి హామీ సిబ్బంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ రాజు, ఫీల్డ్ అసిస్టెంట్స్ అధ్యక్షలు బల్లా ప్రసాద్,జుర్రా సత్యనారాయణ,సుర్ల దేవుడు రాజు, మూర్తి, జుర్రా రమణ,టిఏ వెంకట్,ధర్మ, లక్ష్మణ్ మహిళలు,గ్రామస్థులు, బందువులు పాల్గొన్నారు.