అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం మర్రివాడ పంచాయతీ దొడ్డవరం గ్రామ పరిధిలో ఉన్న పంట కాలువ వంతెన ఎట్టకేలకు కూలిపోయింది. దీనితో దొడ్డవరం తాళ్లపాలెం మర్రివాడ జీడిపాలెం తదితర గ్రామాలకు చెందిన సుమారు 1500 ఎకరాల పొలాలకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. ఈ వంతెన శిథిలావస్థలో ఉండగా మరమ్మతులు చేయించాలని ఆయకట్టు ప్రాంత రైతులు పలుమార్లు అధికారులకు,ప్రజాప్రతినిధులకు విన్నపాలు చేస్తూ వస్తున్నామని తెలిపారు.అయితే దీనిని మరమ్మతు చేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఎట్టకేలకు పంట కాలువ వంతెన కూలిపోయిందని,దీంతో సాగునీరు వృధాగా పోతుందని రైతులు తెలిపారు. అధికారులు,ప్రజా ప్రతినిధులు స్పందించి పంట కాలువా వంతెనను నిర్మించాలని రైతులు కోరుతున్నారు.