Breaking News

వరినాట్లు వేస్తున్న మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్.

0 58


చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ గురువారం వరినాట్లు కార్యక్రమం నిర్వహించారు.ఆమె స్వగ్రామమైన అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం నల్లగొండ పంచాయితీ గ్రామంలో గడుతూరి లక్ష్మణ్ రావు అనే రైతు పొలంలో అనేక మంది మహిళలతో పాటు కలిసి వరినాట్లు వేశారు.ఈ సందర్భంగా జైతి రాజులమ్మ మాట్లాడుతూ..ఈ గిరిజన ప్రాంతంలో పండిస్తున్న అనేక రకాల పంటలలో వరి పంట ప్రధానమైన పంట అని,వరి పంట పండించడానికి రైతులు అధిక ప్రాధాన్యత ఇస్తారని ఆమె అన్నారు.ఈ వరినాట్లు కార్యక్రమంలో అనేక మంది మహిళలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.