Breaking News

అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదులకు మొదటి విడత లా నేస్తం కింద 6.12 కోట్లు జమ.

0 14

అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదులకు 2023–24కి గాను మొదటి విడత లా నేస్తం కింద రూ.6.12 కోట్లు జమ.

ఇప్పటి వరకు ఈ పథకం కింద 5781 మంది జూనియర్ లాయర్లకు రూ.41.52 కోట్లు జమ.

వైఎస్సార్ లా నేస్తం వంటి పథకం దేశంలో మరెక్కడా లేదు.


తాడేపల్లి: వైఎస్సార్ లా నేస్తం పథకం, ఇలాంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో లేదని, కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. అడ్వకేట్లకు అన్నిరకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో ఇప్పటికే వెల్ఫేర్ ట్రస్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ట్రస్ట్ ద్వారా మెడిక్లెయిం కాని, ఇతరత్రా అవసరాలకు రుణాలు కావొచ్చు… ఈ ఫండ్ నుంచి రూ.25 కోట్లు సహాయం చేయడం జరిగిందన్నారు. న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలిచిందని, ప్రభుత్వం తరఫునుంచి న్యాయవాదులను కోరేది ఒక్కటే..జూనియర్లుగా ఉన్న న్యాయవాదులు ప్రతి ఒక్కరూ కూడా దీనివల్ల మంచి జరిగితే.. వీరు స్థిరపడ్డాక ఇదే మమకారం పేదలపట్ల విశ్వాసం చూపిస్తారని.. ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా వారి దగ్గరనుంచి ఆశిస్తున్నానని చెప్పారు. దీన్ని ఎప్పుడూ మరిచిపోవద్దని సీఎం జగన్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టైఫండ్ చొప్పున 2023–24 సంవత్సరానికి మొదటివిడత ‘వైయస్ఆర్ లా నేస్తం’ ఆర్థిక ప్రోత్సాహకాన్ని సీఎం జగన్ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి విడుదల చేశారు. అంతకుముందు వర్చువల్ గా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. 

ముఖ్యమంత్రి ఏమన్నారంటే..   

దేవుడి దయతో ఈ రోజు ఒక మంచి కార్యక్రమం..గత నాలుగేళ్లుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరానికి సంబంధించి ఈ ధపా జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా 2770 మంది నా అడ్వకేట్ చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం ద్వారా రూ. 6 కోట్ల12 లక్షల 65 మేరకు వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నామన్నారు. ఒక మంచి ఆలోచన, ఒక మంచి కార్యక్రమం అని.. న్యాయవాదులు ఎవరైనా కూడా లా కోర్స్ కంప్లింట్ చేసి మొదటి మూడు సంవత్సరాలు ప్రాక్టిస్ లేని పరిస్థితిలో వారి కాళ్లపై వారు నిలబడేందుకు వారికి తోడుగా నిలుస్తూ ప్రతి నెల రూ.5 వేల చొప్పున, ఏడాదికి రూ.60 వేలు వారి చేతుల్లో డబ్బు ఉంటే..ఈ మూడేళ్లు ప్రతి ఏటా రూ.60 వేల చొప్పున మూడేళ్లలో రూ.1.80 లక్షలకు వారికి తోడుగా ఉంటే వృత్తిలో ఇబ్బందులు లేకుండా మంచి జీవితంలో నెట్టుకురాగలుగుతారన్నారు.

మంచి ఆలోచనతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో దాదాపుగా ఇప్పటికే ఈ పథకం ద్వారా 5781 మంది జూనియర్ లాయర్లకు మంచి జరిగిస్తూ, గతేడాది నవంబర్లో ప్రారంభించిన ఈ కార్యక్రమం నాలుగేళ్లలో ప్రతి నెల జూనియర్ లాయర్లకు రూ.5 వేల చొప్పున అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు రూ.41.52 కోట్లు విడుదల చేశామన్నారు. నిజంగా ఇటువంటి ఆలోచన అన్నది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. జరుగుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన రాష్ట్రం మాత్రమే కాదు.

ఇంకా అడ్వకేట్లకు మంచి జరగాలనే ఆలోచనతో రూ.100 కోట్లతో అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ట్రస్ట్ నుంచి న్యాయవాదుల అవసరాలకు అంటే మెడిక్లైమ్స్, ఇతర రుణాలు రకరకాల పద్ధతుల్లో ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. ఇదంతా కూడా ఈ నాలుగేళ్ల కాలంలో నిజంగా రాష్ట్రం ప్రభుత్వం తోడుగా ఉంది అని చెప్పేందుకు ఈ రెండు కార్యక్రమాలు చెప్పవచ్చు అన్నారు.

ఈ కార్యక్రమం ఎందుకు ఇంతగా మనసు పెట్టి చేస్తున్నామంటే..దానికి కారణం ప్రభుత్వం తరఫున నుంచి నా కోరిక కూడా ఉందన్నారు. జూనియర్ న్యాయవాది వృత్తిలో ఉన్న ప్రతి లాయర్ కు ప్రభుత్వం నుంచి మంచి జరిగిస్తే..ఇదే మమకారం వీళ్లు పేదల పట్ల చూపిస్తారని.. అన్నగా ప్రభుత్వం తరఫున నుంచి వాళ్ల నుంచి కోరుకుంటున్నానని సీఎం జగన్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.