Breaking News

క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధులు గాం కుటుంబ సభ్యులకు ఇళ్ళులు మంజూరు.

0 101

క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో
స్వాతంత్ర్య సమరయోధులు గాం కుటుంబ సభ్యులకు ఇళ్ళులు మంజూరు.

ఈరోజు స్థలాన్ని పరిశీలించిన వైసీపీ నాయకులు,అధికారులు, క్షత్రియ పరిషత్ సభ్యులు.
ఎన్నో ఏళ్లుగా సరైన గృహాలు లేక ఇబ్బందులు పడుతున్న స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలు గాం గంటందొర,మల్లుదొర కుటుంబ సభ్యులకు ఇన్నేళ్లకు వారి కల నెరవేరబోతుంది.స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులు సరైన గృహాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి,అరకు ఎంపీ గొడ్డేటి మాధవి చొరవతో క్షత్రియ పరిషత్ వారు హైదరాబాద్ కి చెందిన నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వారితో ఇళ్ళులు కట్టేందుకు ముందుకు వచ్చారు.ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం,బట్టపనుకుల పంచాయతీలోని లంకవీధిలో గాం గంటందొర,గాం మల్లుదొర కుటుంబ సభ్యులకు 11మందికి ఇళ్ళులు కట్టేందుకు గల స్థలాన్ని ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు,ఎన్ సి సి కన్సల్టెంట్ సభ్యులు ఎం.పీ.రాజు,స్థానిక కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్, మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు, ఎమ్మార్వో తిరుమలరావు కలిసి పరిశీలించడం జరిగింది.
నెల రోజుల్లో ఇళ్ళులు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందని క్షత్రియ పరిషత్ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో క్షత్రియ పరిషత్ సభ్యులు బంగారు రాజు, ప్రదీప్ వర్మ, నడింపల్లి నానిరాజు,చక్రపాని రాజు,నాగేంద్ర రాజు, క్షత్రియ పరిషత్ ఇతర సభ్యులు, వైసీపీ పార్టీ నాయకులు గాడి సత్యనారాయణ, బండి సుధాకర్,పాటి శేఖర్,కాళ్ళ వనుంబాబు,సడ్డా సావిత్రి,ఎంపీటీసీ సడ్డా మల్లీశ్వరి,స్థానిక సర్పంచ్ బాలకృష్ణ,గాం గంటందొర,మల్లుదొర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.