Breaking News

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కి ఘన స్వాగతం పలికిన అరకు ఎంపీ.

0 13

  అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు మండల కేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని తో కలిసి అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పాల్గొన్నారు.మంత్రి కి ప్రజాప్రతినిధులతో కలిసి అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఘన స్వాగతం పలికారు.

ముందుగా మన్యం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద పండితులచే ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అలాగే అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు.అనంతరం సికిల్ సెల్ నిర్ధారణ పరీక్షల ల్యాబ్ ప్రారంభోత్సవం, పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల పరిశీలన,సీజనల్ వ్యాధులపై సమీక్ష పలు కార్యక్రమాల్లో మంత్రి తో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులతో అరకు ఎంపీ  మాధవి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్య‌ల‌క్ష్మి ,అర‌కు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ‌ ,జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ జల్లిపల్లి సుభ‌ద్ర‌ ,జిల్లా క‌లెక్ట‌ర్ సుమిత్,ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.