Breaking News

ఈనెల 28న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలు బంద్: ఏబీవీపి

0 32

ప్రభుత్వ ఇంటర్ విద్యను ఆటకెక్కించి కార్పొరేట్ కు దాసోహమైన రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నట్లు అల్లూరి జిల్లా కన్వీనర్ పూజారి ఉపేంద్ర తెలిపారు.పాడేరు నగర కార్యదర్శి గిర్లియ నాగార్జున ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి బంద్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లంగి మహేష్ బాబు మాట్లాడుతూ..ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఇంటర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా జెఇఇ నీట్ కోచింగ్ పేరుతో ఇంటర్ మీడియట్ అడ్మిషన్ చేస్తున్న ఆకాష్ -అకాడమీ,వశిష్ఠ సంస్థలను సీజ్ చెయ్యాలని,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2 వేలకు పైగా కాలిగా ఉన్న లెక్చరర్ పోస్టులకు వెంటనే భర్తీ చెయ్యాలని అలాగే జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం తొమ్మిది రకాలైన డిమాండ్లతో కూడిన బంద్ పోస్టర్ ను తదితర ఏబీవీపీ నాయకులతో ఆవిష్కరించారు.అలాగే ఈ బంద్ కు అందరు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గిర్లియ బాబ్జి, మహేష్,మాజీ జిల్లా కన్వీనర్ గెమ్మెలి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.