Breaking News

సబ్సిడీ విత్తనాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయకులు.

0 14


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రత్నంపేట పంచాయితీ గ్రామంలో బుధవారం 90% సబ్సిడీతో ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలు పంపిణీ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సిపి జగన్ ప్రభుత్వమని కొనియాడారు.

అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న వైసిపి ప్రభుత్వానికి రాబోయే 2024 ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్పర్సన్ జైతి రాజులమ్మ, జడ్పీటీసీ వారా నూకరాజు, మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు, ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ముసిలి నాయుడు, స్థానిక రత్నంపేట సర్పంచ్ పాటి నూకరత్నం,కినపర్తి సర్పంచ్ రీమల శ్రీను వైసీపీ నాయకులు పాటి శేఖర్, తిరుపతి, రామరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.