Breaking News

సమగ్రాభివృద్ధి,సంక్షేమమే లక్ష్యం: పాడేరు ఎమ్మెల్యే

0 159

సమగ్రాభివృద్ధి,సంక్షేమమే లక్ష్యం.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి.
అర్హతే ప్రామాణికంగా కుల,మత,రాజకీయ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత వైఎస్ఆర్సిపి ప్రభుత్వానిదేనిని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు.అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం కొమ్మిక గ్రామ సచివాలయం పరిధిలోని ఊరలోద్ది,గంగవరం,తాళ్లపాలెం,కొమ్మిక,రేవళ్లులో
బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరై ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా 284 గడపలను సందర్శించారు.ఇంటింటికి వెళ్లి నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, అమలు చేస్తున్న పథకాలను గణాంకాలతో సహా వివరించారు.అలాగే ఏవైనా సమస్యలు ఉన్నా అర్హులై ఉండి ఎవరికైనా పథకాలు అందకపోయినా తెలియజేయాలని కోరారు.గతంలో మాదిరిగా లంచాలకు తావు లేకుండా పథకాలు,ప్రభుత్వ సేవలు అందుతున్నాయని ప్రజల ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.రాష్ట్ర సమగ్ర అభివృద్ధి,ప్రజా సంక్షేమమే సీఎం జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని ఆమె తెలిపారు. ఒకవైపు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా అభివృద్ధి పనులు చేయడంతో పాటు అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సెగ్గే సూరిబాబు,స్థానిక ఎంపీటీసీ కమటం అర్జమ్మ,ఎంపీపీ బడుగు రమేష్,మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు,ఏఎంసి చైర్మన్ జైతి రాజులమ్మ,బిసి డైరెక్టర్ గాడి నాగమణి,వైస్ ఎంపీపీలు అప్పన వెంకటరమణ,నూకాలమ్మ,జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు ధోని బాబ్జి,మండల కన్వీనర్ బండి సుధాకర్,మండల మహిళా అధ్యక్షులు సడ్డా సావిత్రి,సర్పంచ్ ఫోరం అధ్యక్షులు రేగటి ముసలి నాయుడు,ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్,మాజీ పిఎసీఎస్ చైర్మన్ అప్పన గజ్జయ దొర,కంఠారం వైస్ సర్పంచ్ కాళ్ల వనంబాబు,ఎంపిటిసి మల్లేశ్వరి,సీనియర్ నాయకులు గాడి సత్యనారాయణ,పాటి శేఖర్,రామరాజు,శ్రీను,మాజీ సర్పంచులు చల్లారావు,లోవరాజు,రావాడ శేఖర్,పోతురాజు,రమణ,అప్పారావు,గంగరాజు, గంగరత్నం,చిన్న,పోతురాజు,కోడా రాజుబాబు,లక్ష్మణరావు,కార్యకర్తలు, ప్రజలు,అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.