Breaking News

రావణాపల్లి సచివాలయంలో విజయవంతంగా జగనన్న సురక్ష క్యాంప్.

0 14

 విజయవంతంగా జగనన్న సురక్ష క్యాంప్.

రావణాపల్లి సచివాలయంలో అర్హులకి సర్టిఫికేట్స్,రేషన్ కార్డులుతో కూడిన 11రకాలు ధృవపత్రాలు పంపిణీ.

ముఖ్య అతిధులగా ఎంపీపీ బడుగు రమేష్,చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ జైతి రాజులమ్మ,మండల అధ్యక్షులు జల్లి బాబులు,బీసీ డైరెక్టర్ గాడి నాగమణి, వైస్ ఎంపీపీ అంబటి నూకాలమ్మ, చింతపల్లి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అచ్యుత్,మండల‌ నాయకులు గాడి సత్యనారాయణ,మండల జెసిఎస్ కన్వీనర్ బండి సుధాకర్.


(అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం): ఎమ్మార్వో తిరుమలరావు ఆధ్వర్యంలో శనివారం జరిగిన జగనన్న సురక్ష ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమం ఈరోజు రావణాపల్లి సచివాలయం పరిధిలో వారం రోజులు సర్వే నిర్వహించిన తరువాత ఈరోజు క్యాంప్ నిర్వహించి ప్రజలకు కావాల్సిన పత్రాలు అందించడం జరిగిందని,ఎంతోమందికి ఉపయోగపడే ఈ కార్యక్రమంలో ప్రజలు చక్కగా వినియోగించుకున్నారు అని అంతేకాకుండా అధికారుల పరంగా కన్వీనర్లు,గృహ సారథులు,వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అందరూ చక్కగా సమన్యాయం చేసుకొని తగిన సమయంలోనే అర్హులన ప్రతి ఒక్కరికీ వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అందించడంలో నూటికి నూరు శాతం సఫలం అయ్యారని చెప్పుకోవాలని అభినందించారు.

వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ప్రజలకు అందుబాటులో 2000 మంది జనాభాకు ఒక సచివాలయం, సచివాలయం పరిధిలో ఒక రైతు భరోసా కేంద్రం ఇలా అనేకమైనవి తీసుకొస్తూ ప్రజల వద్దకే పాలన అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సిపి జగన్ ప్రభుత్వం అని కనుక ప్రజలకు మంచి పాలనను అందిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి మరలా 2024 సంవత్సరంలో ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.అనంతరం జగనన్న సురక్ష పోకెట్ క్యాలెండర్ ను నాయకులు ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా ‘జగనన్న సురక్ష’ ప్రోగ్రాం ఇంత విజయవంతంగా జరగడానికి పూర్తి సహకారం అందించిన ఎమ్మార్వో తిరుమలరావుకి,రావణాపల్లి,నల్లగొండ పంచాయతీ కార్యదర్శులు రజినీ,సత్యగౌరీ, వీఆర్వో లు లక్ష్మి, ప్రసాద్, డిజిటల్ అసిస్టెంట్ గౌతమి కి ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ, ఎంపీపీ బడుగు రమేష్,మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు, ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్ తదితర మండల నాయకుల చేతుల మీదుగా శాలువాలతో సన్మానించారు.

తిరుమలరావు(తాహశీల్దార్)

రజిని(పంచాయితీ కార్యదర్శి)

సత్యగౌరి(పంచాయితీ కార్యదర్శి)

లక్ష్మి (వీఆర్వో)

ప్రసాద్ (వీఆర్వో)

గౌతమి (డిజిటల్ అసిస్టెంట్)

మున్ముందు మీ సహకారం ఇలాగే ఉండాలని నాయకులు అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్లు,గృహ సారధులు, సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు,ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.