Breaking News

ఊహించని రీతిలో ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికిన బకులూరు పంచాయితీ ప్రజలు.

0 169

మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు, స్థానిక సర్పంచ్ పొట్టిక శ్రీను ఆధ్వర్యంలో పండుగ వాతావరణం తలపించేలా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కి కోలాటం,డాన్సులతో సాదర స్వాగతం పలికారు.

ప్రతీ గడపలోను ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం,బకులూరు సచివాలయం పరిధిలోని అంకంపాలెం,నెల్లిపూడి,బకులూరు గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
మొత్తం 275 గడపలను ఎమ్మెల్యే సందర్శించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరించారు. ఒక్కొక్క కుటుంబం 4 నుంచి 5 లక్షల వరకు సంక్షేమ పథకాల రూపంలో ఆర్థిక సాయం పొందుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇదివరకు ఎప్పుడూ ప్రభుత్వాలు ఇంత భారీ ఎత్తున ఆర్థిక సహకారం అందించిన సందర్భాలు లేవని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గుర్తించిన సమస్యలు పరిష్కారానికి వెంటనే చొరవ చూపుతున్నట్లు తెలిపారు. అవసరమైన చోట్ల సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ప్రతి గడప లోను ఆమెకు సాదర స్వాగతం పలికుతూ,ఇంతటి అభిమానాన్ని చూపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు,స్థానిక సర్పంచ్ పొట్టిక శ్రీను, వైస్ సర్పంచ్ కుమారి, ఎంపీపీ బడుగు రమేష్, జడ్పిటిసి వారా నూకరాజు,చింతపల్లి ఏఎంసి చైర్పర్సన్ జైతి రాజులమ్మ, రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ సుమర్ల సరస్వతి, వైస్ ఎంపీపీ లు అప్పన వెంకటరమణ,అంబటి నూకాలమ్మ, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు ధోని బాబ్జి,మండల కన్వీనర్ బండి సుధాకర్,పి.మాకవరం ఎంపీటీసీ మల్లీశ్వరి,సీనియర్ నాయకులు గాడి సత్యనారాయణ,మండల మహిళా అధ్యక్షురాలు సడ్డా సావిత్రి,పీఎసీఎస్ మాజీ చైర్మన్ అప్పన గజ్జయ్యదొర,చీడిపాలెం సర్పంచ్ సోమన్న దొర,ఎం.మాకవరం సూపర్ సర్పంచ్ రాజుబాబు, నాయకులు పాటి శేఖర్,బుజ్జి,నీలాపు సూరిబాబు,పొట్టిక పోతురాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.