అడవి బిడ్డలకు పలకలు,పెన్నులు,నోట్ బుక్స్,పెన్సిల్ పంపిణీ చేసిన దుమంతి.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లోని బాలరేవుల గ్రామంలో ఈరోజు 40 మంది నిరుపేద ఆదివాసీ విద్యార్థులకు పలకలు, నోటుబుక్స్,పెన్నులు,పెన్సిల్ లు తాహశీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ దుమంతి సత్యనారాయణ పంపిణీ చేశారు.
కూలి పని చేసుకునే వ్యక్తి నుండి రాష్ట్రపతి స్థాయిలో వున్న వారి వరకు తమ పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలి అనే తపనతో వుంటారు కానీ పేదరికం వలన కొంత మంది తమ పిల్లలకు కనీసం పలక కూడా కొనిచ్చే స్థాయిలో లేరని,అది చాలా బాధాకరమని అన్నారు.
పే బ్యాక్ టు ది సొసైటీ (Pay back to the Society) అనే
భావంతో ప్రతీ నెలా కొంత మంది పేద పిల్లలకు స్టడీ మెటీరియల్
తన వంతు సాయంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో దుమంతి కిరణ్,పొగడాల అరవింద్,కిలే లక్ష్మణ్,మొయిరి మహేష్,కొక్కుల రవి మొదలగు వారు పాల్గొన్నారు.
Next Post