Breaking News

అక్రమంగా గంజాయి తలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు.

0 17


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఏజెన్సీ నుండి మైదాన ప్రాంతాలకు బైక్ పై గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులను 10 కేజీ గంజాయితో దొడ్డవరం గ్రామ సమీపంలో కొయ్యూరు పోలీసులు పట్టుకోవడం జరిగింది. చింతపల్లి మండలంలో మారుమూల గ్రామాల నుండి పెదవలస, బూదరాల్ల, చీడిపాలెంం, రాజవొమ్మంగి మీదుగా ఏలేశ్వరం, ఎర్రవరం మీదగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను 10 కేజీలు గంజాయితో పాటు, ఒక ద్విచక్ర వాహనoను కొయ్యూరు పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దొడ్డవరం గ్రామ శివారు వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా రాజమండ్రి కు చెందిన షేక్ రిజ్వన్ అనే వ్యక్తి తో పాటు చింతపల్లి మండలంకు చెందిన కొర్ర మోహన్ బాబు అనే వ్యక్తితో కలిసి ఒక ద్విచక్ర వాహనo మీద 10 కేజీలు గంజాయి తరలిస్తుండగా దొడ్డవరo వద్ద పోలీసులకు పట్టుబడడం జరిగింది. సదరు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని కొయ్యూరు ఎస్ఐ రాజారావు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.