అరకు పార్లమెంట్ పరిధిలోని పాలకొండ నియోజకవర్గంలో గల చినబగ్గ గ్రామంలో 40కి పైగా వాలీబాల్ కిట్లను నేనుసైతం శివప్రసాద్ యువతకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన స్థానిక యువకులకు క్రీడలలో మరింత ముందుకు రాణించాలని క్రీడలతో శరీర దారుణ్యాన్ని పెంపొందించవచ్చని మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు.నేనుసైతం ఫౌండేషన్ చేపడుతున్న పలు కార్యక్రమాలను వివరించారు.ఎవరికి ఏ అవసరమైన తనను సంప్రదించాలని తెలియజేశారు.
గత 10 రోజులుగా అరకు పార్లమెంట్ పరిధిలో పలుచోట్ల 150కి పైగా వాలీబాల్ కిట్లను శివప్రసాద్ పంపిణీ చేసారు.
యువత వాలీబాల్ కిట్లు తీసుకుని చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇంతకుముందు వాళ్లకి క్రీడల్లో ప్రోత్సాహం చాలా కరువైందని యువత తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే కళావతి, జెడ్పీటీసీలు,ఎంపీటీసీలు,సర్పంచులు,గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.