కొవ్వూరు:‘ఫిష్ ఆంధ్ర’ షాపుల ద్వారా స్థానికంగా తలసరి మత్స్య ఉత్పత్తుల వినియోగం పెంచడమే కాకుండా నాణ్యమైన,బతికిఉన్న,తాజా మత్స్య ఉత్పత్తులను ప్రజలకు అందించడం జరుగుతుందని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. హోంమంత్రి క్యాంపు కార్యాలయం ఆవరణలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం (పీఎంఎంఎస్‌వై) ద్వారా త్రీ వీలర్ (ఆటో) వాహనాన్ని శనివారం రాత్రి ప్రారంభించారు. కొవ్వూరు పట్టణంలోని అచ్చాయమ్మ కాలనీకి చెందిన పేరూరి శివరామకృష్ణ కు 3 లక్షల విలువైన త్రీ వీలర్ లైవ్ ఫిష్ ట్రాన్స్ ఫోర్ట్ వాహనాన్ని ఆమె అందించారు.. పీఎంఎంఎస్‌వై పథకం ద్వారా బతికి ఉన్న చేపలు,చేపల విత్తన రవాణా కొరకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీతో ఈ వాహనం అందించడం జరిగిందని హోంమంత్రి తెలిపారు.40 శాతం సబ్సిడీతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ వాహనం అందించడం జరిగిందన్నారు.ఫిష్ ఆంధ్ర కార్యక్రమం ద్వారా శివ కి ఉపాధి సాధించడంతో పాటు తన వ్యాపారం అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు..అనంతరం వాహనంలో ఉన్న పరికరాలను హోంమంత్రి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు,మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.