Breaking News

అంతాడ సచివాలయంలో సర్పంచ్ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం.

0 17

 అల్లూరి సీతారామరాజు జిల్లా: కొయ్యూరు మండలం లోని బంగారంపేట-1 సచివాలయం, అంతాడ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు,సచివాలయ సిబ్బందితో పంచాయతీ సర్పంచ్ సుర్ల చంద్రరావు గ్రామ సభ నిర్వహించారు.’జగనన్న సురక్ష’కు సంబంధించిన విధి విధానాల గురించి సచివాలయ సిబ్బందితో కలిసి అవగాహన కల్పించారు.

ఈ సమావేశానికి ఎంపీటీసీ ఇరువాడ సత్యవాణి, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు,ఆశా వర్కర్లు,ఫీల్డ్ అసిస్టెంట్లు,గృహ సారథులు, వార్డు మెంబర్లు హాజరవడం జరిగింది.

ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి సర్పంచ్ చందర్రావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పనితీరు గురించి ఎక్కువగా ఉద్దేశించి మాట్లాడారు. అలాగే ప్రస్తుతం రానున్నది వర్షాకాలం కనుక పారిశుధ్యం, ఆరోగ్య పరిస్థితుల గురించి, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని ఆదేశించారు.

అలాగే ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లను పని దినాలు గురించి సర్పంచ్ ప్రశ్నించడం జరిగింది.అలాగే సచివాలయ సిబ్బంది పనితీరు, అందించే సేవలు గురించి ప్రజలతో మమేకమై జగనన్న సురక్షలో 12వ తారీఖున జరగబోయే క్యాంపుకు వారం రోజులు ముందుగా విధివిధానాలలో సంబంధిత డిజిటల్ అసిస్టెంట్ కె.ప్రసాద్ తో సంబంధిత వాలంటీర్లకు,ప్రజలకు జగనన్న సురక్షలో అందించు 11 ఉచిత సేవలు గురించి ప్రజలకు గృహ సారధులకు,వార్డు సభ్యులకు తెలియజేయడం జరిగింది.జగనన్న సురక్ష ద్వారా అందించే సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సర్పంచ్ చంద్రరావు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.