Breaking News

అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వేడుకల్లో పాల్గొన్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.

0 17

 అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వేడుకల్లో పాల్గొన్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.

 ఈరోజు విశాఖపట్నంలో రుషి కొండ పరిధిలో ఉన్న గిరిజన సాంస్కృతిక పరిశోధన,శిక్షణ మిషన్ ప్రాంగణంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అలాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర తో కలిసి అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పాల్గొన్నారు.

ముందుగా నూతనంగా ఏర్పాటు చేసిన మన్యం విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు,గాం గంటందొర,గాం మల్లుదొర విగ్రహాలకు డిప్యూటీ సీఎం,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తో.. సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఆవిష్కరించి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ పట్నం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర,విశాఖ జీవీఎంసీ మేయర్ గొలాగాని వెంకటహరికుమారి,జీసీసి చైర్ పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి,పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్,జిసీసి ఎం.డి సురేష్,ట్రైకార్ ఎం.డి రవీంద్ర బాబు, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నత అధికారులు,విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.