Breaking News

కొయ్యూరు: రామాలయంలో వారం రోజుల పాటు ప్రత్యేక ఆద్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు.

0 52

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో తిరుమల తిరుపతి దేవస్థానం.. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా కాకరపాడు సీతారామాలయంలో వారం రోజులు పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పురాణ పండితులు చల్లా సత్యనారాయణ,ప్రవచనకర్త డి పద్మరాజు ఆధ్వర్యంలో ఈ నెల 11 మంగళవారం నుండి 15 శనివారం వరకు ఆలయంలో ప్రత్యేక భజన పూజ కార్యక్రమాలు నిర్వహించారు.హనుమాన్ చాలీసా పఠనం,భగవద్గీత వచన కార్యక్రమాలతో పాటు శుక్రవారం రాత్రి గ్రామ భక్తులచే ప్రత్యేక కుంకుమ పూజలు జరిపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాలలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో మండలాల వారీగా నెలనెలా ప్రత్యేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతూ గిరిజనులలో భక్తి భావాన్ని నింపుతున్నారు. రానున్న శ్రావణమాసంలో మన్యవ్యాప్తంగా ఆయా మండలాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినిధులు ప్రవచనకర్తలు పురాణ పండిత్ చల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించనున్నట్లు పద్మరాజు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.