అల్లూరి సీతారామరాజు జిల్లా: కొయ్యూరు మండలానికి చెందిన ఏకలవ్య పాఠశాల భవన సమస్యపై తల్లిదండ్రులతో అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ బడుగు రమేష్,ఏటీడబ్ల్యూఓ క్రాంతి కుమార్.
తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణలో చింతపల్లి లోని వైట్ హౌస్ లో పెట్టాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీపీ బడుగు రమేష్ మాట్లాడుతూ.. పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి,జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటీడీఏ పీఓ అభిషేక్ తో మాట్లాడి
ఏకలవ్య పాఠశాల భవనం నిర్మాణం అయినంత వరకు చింతపల్లి వైట్ హౌస్ లో పెడతాము అని హామీ ఇచ్చారు.పిల్లలు మనస్తాపం చెందకుండా బాగా చదవాలని, భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలకు చేరాలని కోరారు.ఈ విషయం పై తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో ఏకలవ్య ప్రిన్సిపాల్ విటల్,ఏపీఆర్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్,ఏపీఆర్ వైస్ ప్రిన్సిపాల్ మోహన్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.