ఎమ్మెల్యే,ఎంపీ కి కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ చంద్రరావు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు గంగాధర్.
అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం అంతాడ పంచాయితీకి చెందిన కొత్తపల్లి గ్రామం నుంచి బంగారంపేట వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈరోజు రహదారి పనులు,రహదారి నాణ్యతను స్థానిక సర్పంచ్ చంద్రరావు,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు గంగాధర్, వైసిపి నాయకులు కన్నబాబు పరిశీలించారు. రహదారి విషయంలో నాణ్యతను పాటించవలసిందిగా కాంట్రాక్టర్ కి తెలియపరచడం జరిగింది.మరొక ఐదు రోజులలో రోడ్డు పనులు పూర్తి అయిన తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని చంద్రరావు,గంగాధర్ తెలిపారు.సరైన రహదారి లేక కొన్ని సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఎమ్మెల్యే, ఎంపీ,మండల నాయకులు చొరవతో బీటీ రోడ్డు మంజూరు అయిందని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే, ఎంపీ, కొయ్యూరు ఎంపీపీ,జడ్పీటీసీ,వివిధ విభాగాల చైర్మన్లు, వైస్ ఎంపీపీ లు,డైరెక్టర్ లు ఎంపీటీసీలు,సర్పంచులు, నాయకులు,కార్యకర్తలు వివిధ శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు అందరూ పాల్గొననున్నట్లు తెలిపారు.