Breaking News

జగనన్న సురక్ష పై ప్రజలకు అవగాహన కలిగిస్తున్న తిరుపతిరావు.

0 17

 జగనన్న సురక్ష పై ప్రజలకు అవగాహన.

కార్యక్రమంలో పాల్గొన్న సచివాలయ కన్వీనర్ కొర్రా తిరుపతిరావు.

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బూధరాళ్ళ పంచాయితీ లోని వంతమర్రి గ్రామంలో సచివాలయ కన్వీనర్ కొర్రా తిరుపతిరావు జగనన్న సురక్ష కార్యక్రమం గురించి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న 11 రకాల సర్టిఫికెట్స్ గురించి వివరించడం జరిగింది.ప్రజలందరూ ‘జగనన్న సురక్ష’ ప్రోగ్రాం ద్వారా అందించనున్న సర్టిఫికెట్ల కోసం అప్లై చేసుకుని పొందాలని, ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.నారాయణ,వాలంటీర్ పాంగి.రమేష్, బాలరేవుల గ్రామ వాలంటీర్ కిలే.అక్కమ్మ ,లక్ష్మణరావు గృహసారధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.