Breaking News

గిరిజనుల ఆర్థిక పురోభివృధ్ధే జగనన్న లక్ష్యం-పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి

0 17

 గిరిజనుల ఆర్థిక పురోభివృధ్ధే జగనన్న లక్ష్యం.

గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి.


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం:

గిరిజనుల ఆర్థిక పురోభివృద్ధే జగనన్న లక్ష్యం అని పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. సంక్షేమ పథకాల ద్వారా గిరిజనులలో ఆర్థిక సామర్థ్యాలను పెంచాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చెప్పారు. అందుకే అర్హత ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం ఎం.మాకవరం గ్రామ సచివాలయం పరిధిలోని పిట్టాచలం,పనసలపాడు గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 150 గడపలను సందర్శించారు. ఈ కార్యక్రమానికి పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై గడపగడపకు తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎమ్మెల్యే కి తెలియజేసిన సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఆర్థిక పరమైన సమస్యల పరిష్కారానికి ఉన్నత అధికారులకు సిఫార్సు చేశారు. గడపగడపకు తిరుగుతూ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నాలుగేళ్లు సంక్షేమ పథకాలు రూపంలో పేద ప్రజలకు చేసిన సాయం గురించి వివరించారు. ప్రజల సమస్యలను నేరుగా ప్రభుత్వమే తెలుసుకోవడం అనేది వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతుందన్నారు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ని పాలించిన ప్రభుత్వాలు పారదర్శకమైన పాలనందించడంలో వైఫల్యం చెందాయన్నారు. ఏదైతే ఎలక్షన్ లో మాట ఇచ్చారో దానికి కట్టుబడి ఈరోజు ప్రతి విషయంలో ప్రభుత్వమే జవాబుదారితనం పాటిస్తుందని తెలిపారు. ఇదివరకు పాలించిన ప్రభుత్వాలు ఏం పని చేశాయన్న సమాచారం కూడా ప్రజలకు తెలిసేది కాదన్నారు. ఈరోజు మేనిఫెస్టోనే ఒక భగవద్గీతలా భావించి ప్రతి ప్రభుత్వ, సచివాలయ కార్యాలయంలో అతికించి మరీ పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కోడా చింతల్లి,ఎంపీటీసీ పొడుగు రత్నం, ఎంపీపీ బడుగు రమేష్,జడ్పిటిసి వారా నూకరాజు,ఏఎంసీ చైర్మన్ రాజులమ్మ,మండల అధ్యక్షులు జల్లిబాబులు, బీసీ డైరెక్టర్ గాడి నాగమణి,మండల కన్వీనర్ బండి సుధాకర్,ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్,వైస్ ఎంపీపీలు వెంకటరమణ,నూకాలమ్మ, సర్పంచుల ఫోరం అధ్యక్షులు ముసలి నాయుడు,ప్రచార కమిటీ అధ్యక్షులు బాబూజీ,నాయకులు గాడి సత్యనారాయణ,వనుంబాబు,పాటి శేఖర్, ప్రసాద్, గంగాధర్, సర్పంచ్ శోభన్, నాయకులు రాజు, శ్రీను, మహేష్, గౌరీ, తిరుపతి, నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.