Breaking News

ధరఖాస్తు పెట్టిన రోజే సర్టిఫికేట్లు ఇవ్వడం ఇదే తొలిసారి-పాడేరు ఎమ్మెల్యే

0 16

ధరఖాస్తు పెట్టిన రోజే సర్టిఫికేట్లు ఇవ్వడం ఇదే తొలిసారి.

జగనన్న సురక్ష కార్యక్రమంలో పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి.

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం:
దరఖాస్తు చేసుకున్న రోజే సర్టిఫికేట్లు మంజూరు చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇది తొలిసారి అని పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు.అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం లోని రేవళ్లు, కొయ్యూరు గ్రామ సచివాలయాల పరిధిలో బుధవారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. రేవళ్లు గ్రామ సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై సర్టిఫికేట్ల కోసం ధరఖాస్తు చేసుకున్న వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ దేశంలోని మన రాష్ట్రంలో మాత్రమే ఇటువంటి గొప్ప కార్యక్రమం ప్రారంభించడం శుభ పరిణామం అన్నారు. ఇంతకుముందు ఈతరహాలో ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు అందజేయడం జరగలేదన్నారు. ఇటువంటి వ్యవస్థ కూడా గతంలో ఎప్పుడూ లేదన్నారు. ఎటువంటి సర్టిఫికెట్లు కావాలన్నా… ఏదైనా పని చేయించుకోవాలన్నా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అనేకమార్లు తిరగాల్సి వచ్చేదని అయినా పనైన సందర్భాలు అరుదని తెలిపారు.

మండల స్థాయిలో కూడా మన పనులు జరగకపోతే జిల్లా స్థాయిలో స్పందన కార్యక్రమంలో ధరఖాస్తు చేసుకునే వెసులుబాటుని ప్రభుత్వం కల్పించిందని భాగ్యలక్ష్మి వివరించారు. అర్హత ఉండి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేకపోతున్న వారిని దృష్టిలో ఉంచుకొని గడప వద్దకే వచ్చి సర్టిఫికెట్లు అందజేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గృహ సారథులు గడపగడపకు వెళ్లి ఏ సర్టిఫికెట్ అవసరం ఉందో వాటికి సంబంధించినటువంటి టోకెన్లు జనరేట్ చేయడం జరుగుతుందన్నారు. రేవళ్లు సచివాలయం పరిధిలోని 580 టోకెన్లు జనరేట్ చేయగలిగితే 352 మందికి ఈరోజే సర్టిఫికెట్లు ఇచ్చామన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమం ఇదివరకు ఎప్పుడైనా మనమంతా ఊహించామా అని ఆమె అన్నారు. స్యాచ్యువేషన్ పద్ధతిలో సంక్షేమ పథకాలతో లబ్ధిదారులు పెరుగుతున్నా వారికి పథకాల రూపంలో ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఆర్థిక సమస్యలు ఉన్న అర్హత ఉండి సంక్షేమ పథకాలు పొందకుండా నష్టపోకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వంలో 32 లక్షల మందికి పెన్షన్ ఇస్తే ఈరోజు 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. ఆరోజు ఎలక్షన్ కు ముందు చంద్రబాబునాయుడు వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ ను రెండు వేలకు పెంచారని నాలుగు నెలలకు ముందు ఎలక్షన్ ఉందని ఈ పెంపు జరిగిందన్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాడే రూ.3000 వరకు పెన్షన్ పెంచుకుంటూ పోతామని చెప్పారని దానికి తగ్గట్టుగానే 2250, ఆ తర్వాత సంవత్సరం 2500, ఇప్పుడు 2750 పెన్షన్ రూపంలో ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేయాలని అంటే ఇచ్చే నాయకుడికి గొప్ప మనసు ఉండాలన్నారు. అలాంటి గొప్ప మనసు వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ఉందన్నారు. సంక్షేమ పథకాల రూపంలో పేద ప్రజల ఆర్థిక సామర్థ్యాలను పెంచే కార్యక్రమం చేపడుతున్నారన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి పట్ల మీరంతా ఆదరాభిమానాలు చూపాలని భాగ్యలక్ష్మి ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఆయనకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత టిడిపి పాలనలో జన్మభూమి కమిటీలు పెట్టినటువంటి ఇబ్బందులను వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకటలక్ష్మి, ఎంపీపీ బడుగు రమేష్ , జడ్పిటిసి వారా నూకరాజు, ఏఎంసీ చైర్మన్ రాజులమ్మ, బీసీ డైరెక్టర్ గాడి నాగమణి, మండల అధ్యక్షులు జల్లిబాబులు, మండల కన్వీనర్ బండి సుధాకర్, ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్, వైస్ ఎంపీపీలు వెంకటరమణ, నూకాలమ్మ , సర్పంచుల ఫోరం అధ్యక్షులు ముసలి నాయుడు, ప్రచార కమిటీ అధ్యక్షులు బాబూజీ, నాయకులు గాడి సత్యనారాయణ ,వనుంబాబు,పాటి శేఖర్, ప్రసాద్, గంగాధర్, సర్పంచ్ శోభన్, ఎంపీడీవో లాలం సీతయ్య, ఎమ్మార్వో తిరుమలరావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.