‘జగనన్న సురక్ష’లో భాగంగా రాత్రి 9గంటలు అవుతున్నా ప్రజలకు అందుబాటులో సచివాలయ సిబ్బంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బకులూరు సచివాలయంలో ‘జగనన్న సురక్ష’కార్యక్రమంలో భాగంగా తమ వద్దకు వచ్చిన అప్లికేషన్లు అన్నీ రాత్రి 9 గంటలు అవుతున్నా సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి జెనరేట్ చేయడం జరిగింది.వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు సచివాలయ సిబ్బంది చేస్తున్న పనితీరును పరిశీలించారు.రాత్రి 9 గంటలు అవుతున్నా ఇంటికి వెళ్ళకుండా ‘జగనన్న సురక్ష’ ప్రోగ్రాం లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 11రకాల సర్టిఫికేట్లు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న సచివాలయ సిబ్బందికి,వాలంటీర్లకు మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు ప్రత్యేకంగా అభినందించారు.తమకు ఉద్యోగ భద్రత కల్పించి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి రుణం తీర్చుకుంటామని, ప్రజలకు మంచి చేసే దిశగా ఇంత మంచి ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు గాను పగలయినా,రాత్రి అయినా తమ వద్దకు వచ్చిన సర్టిఫికేట్లు జెనరేట్ చేసి ధరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికీ వారికి కావాల్సిన పత్రాలు అందేలా చూస్తామని సచివాలయ సిబ్బంది డిజిటల్ అసిస్టెంట్ సతీష్, వెల్ఫేర్ అసిస్టెంట్ శాంతి,వాలంటీర్లు తెలిపారు.