స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తున్న వారి తాటతీస్తా…
-కొయ్యూరు మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు గంగాధర్.
అల్లూరి సీతారామరాజు జిల్లా: కొయ్యూరు మండలంలో వైసిపి పార్టీలో స్వపక్షంలో విపక్షంలో తయారైన వారి తాట తీస్తానని మండల ఎస్టి సెల్ అధ్యక్షుడు గంగాధర్ తీవ్రంగా హెచ్చరించారు.అల్లూరి సీతారామరాజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పాడేరు నియోజకవర్గం శాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆదేశాల మేరకు కొయ్యూరు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జల్లి బాబులు అధ్యక్షన మండలంలో ఉన్న వివిధ శాఖల పార్టీ పదవులు ఎన్నుకునే కార్యక్రమం జరిగిందని గంగాధర్ తెలిపారు. సమావేశంలో మండల స్థాయిలో 14 శాఖలకు సంబంధించినటువంటి పార్టీ పదవుల ఎన్నిక జరిగిందని, ఈ ఎన్నికలో ప్రజాప్రతినిధులు,ఎంపీపీ,వైస్ ఎంపీపీ, జెడ్పిటిసి,మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్, వివిధ శాఖల చైర్మన్లు, వివిధ శాఖల డైరెక్టర్లు,ఎంపీటీసీలు,సర్పంచులు,పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు వీరందరి సమక్షంలో 14 శాఖలకు సంబంధించిన పార్టీ పదవులుకు అధ్యక్షులుగా నియమించడం జరిగినట్లు ఆయన తెలిపారు. దీనిలో భాగంగానే ప్రజా ప్రతినిధులు అందరి చల్లని ఆశీస్సులతో ఎస్టి సెల్ మండల అధ్యక్షుడిగా రీమల గంగాధర్ అనే నన్ను ఎన్నుకోవడం జరిగిందని అన్నారు.ఇదే పదవికి మరొక వ్యక్తి పోటీ పడగా అందరూ అత్యంత మెజార్టీతో తనను ఎంపిక చేయడం జరిగిందని గంగాధర్ చెప్పారు. అదేవిధంగా తనలాగే 14 మందిని కూడా అన్ని శాఖలకు నియమించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు.తనతో పాటు అదే పదవికి పోటీ పడిన మరొక వ్యక్తికి కనీసం సొంత పంచాయితీ సర్పంచ్ కూడా మద్దతు ఇవ్వలేదని అన్నారు.పదవి రాలేదని నిరాశతో ఉన్న ఆ వ్యక్తి నాపై ఏదేదో విమర్శలు చేస్తున్నారని,అలాంటివారు ఇప్పటికైనా మీ రాజకీయ పద్ధతులు మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెప్పడం జరుగుతుందని గంగాధర్ తెలియజేశారు.నేను పార్టీలో చురుకుగా పనిచేసే వ్యక్తినని, రాజకీయ వారసత్వం కలిగిన వ్యక్తినని,ఇంట్లో ఉండి రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని చేతనైతే పార్టీలో నాలా తిరిగి కష్టపడి గుర్తింపు తెచ్చుకోవాలి కానీ నా రాజకీయ ఎదుగుదల చూసి పిచ్చి వేషాలు వేస్తే ఎంతటి వారికైనా తాట తీస్తా అని, సొంత పార్టీ నాయకులు అయినా పిచ్చి వేషాలు,చిల్లర రాజకీయాలు,చెల్లని రాజకీయలు చేస్తే వదిలిపెట్టనని ఈ సందర్భంగా వైసీపీ పార్టీలో మరో వర్గాన్ని హెచ్చరించారు.