Breaking News

నల్లగొండలో వైయస్ రాజశేఖర్ రెడ్డి 74 వ జయంతి వేడుకలు.

0 23

 అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం నల్లగొండ పంచాయితీ గ్రామంలో ఈరోజు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి 74వ జయంతి వేడుకలు చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు అధ్యక్షన ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిధులుగా ఎంపీపీ బడుగు రమేష్, జెడ్పిటిసి వారా నూకరాజు హాజరయ్యారు.ముందుగా రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి, కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ.. రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు పుట్టిన పార్టీనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అని కొనియాడారు.పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు.

నిన్న శుక్రవారం ఉదయం నల్లగొండ గ్రామంలో ఉన్న వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి,ఆంజనేయ స్వామి విగ్రహానికి సంబంధించి టీడీపీ,వైసీపీ పార్టీ నేతలు మధ్య వాదోపవాదనలు జరిగాయి.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ముందు ఐదడుగుల దూరంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది.ఆంజనేయ స్వామి విగ్రహాన్ని రాజశేఖర్ రెడ్డి విగ్రహం ముందుకి తీసుకువచ్చి పెట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసుల రంగప్రవేశంతో ఆ పని ఆగింది.ఈ విషయమై ఎంపీపీ బడుగు రమేష్ మాట్లాడుతూ.. దేవుని పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తే సహించేది లేదని టీడీపీ పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు.రాజకీయ దురుద్దేశంతో వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహం కనబడకుండా దాని ముందు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అడ్డంగా పెట్టాలనుకుంటే మాత్రం ఖబడ్దార్ మా జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.


ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అప్పన వెంకటరమణ,ఎంపీటీసీ బిడిజన అప్పారావు,సీనియర్ నాయకులు గాడి సత్యనారాయణ, ప్రచార కమిటీ అధ్యక్షులు దోని బాబ్జి,మండల కన్వీనర్ బండి సుధాకర్,ఏఎంసీ డైరెక్టర్ లు అచ్యుత్,కమలమ్మ, పీఎసీఎస్ మాజీ చైర్మన్ అప్పన గజ్జయ్యదొర,ఉప సర్పంచ్ కాళ్ళ వనుంబాబు,గదబపాలెం మాజీ సర్పంచ్ నీలాపు సూరిబాబు, నాయకులు పాటి శేఖర్,పెట్ల గాంధీ,ఉల్లి రామ్మూర్తి,వైస్ సర్పంచ్ భవాని,మాజీ సర్పంచ్ జగధీశ్వరి,వార్డు మెంబర్లు దేవి,లక్ష్మి, రాజేశ్వరి,సచివాలయ కన్వీనర్ నాగేంద్ర, అచ్యుత్,గృహ సారధి నాగమణి,మర్రి శివ, అలాగే జుర్రా లక్ష్మి,బచ్చల చంద్రమ్మ,తుర్రె రాము,గ్రామ పెద్దలు,ప్రజలు,మహిళలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.