ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కారు ప్రకటించిన కొత్త పీఆర్సీ రేపిన మంటలు.. కొత్త రాజకీయానికి తెర తీశాయి. ఇంతకాలం ఎవరేం అన్నా.. ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కారుకు తిరుగులేదని.. విపక్షాలు.. మీడియా ఎంత చించుకున్నా.. ప్రజల్లో ఆయనకున్న పరపతి అంతా ఇంతా కాదన్నట్లుగా ప్రచారం జరిగింది. అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల కాలంలో ఇప్పటికే పలు ప్రయత్నాలు జరిగినా.. వాటకి సంబంధించిన ప్రభావం ప్రభుత్వం మీద పెద్దగా పడదన్న వాదన వినిపించేది. అందుకు తగ్గట్లే.. పరిస్థితులు ఉన్నట్లుగా వాదనలు వినిపించేవి. రక.. అవన్నీ తప్పేమో అన్న భావన కలిగించేలా బెజవాడలో ప్రభుత్వ ఉద్యోగుల.. ఉపాధ్యాయుల నిరసన.