Breaking News

అమెరికాలో తగ్గుముఖం పట్టిన కరోనా

0 58

 


ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అగ్రరాజ్యం అమెరికా(America)లో కూడా కోవిడ్ 19 (Covid-19) కల్లోలం సృష్టించింది. సెకండ్ వేవ్ డెల్టా తర్వాత ఓమిక్రాన్(Omicron) వేరియంట్ కూడా ఆదేశంలో భారీగా కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు అమెరికా ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది అక్కడ ప్రభుత్వం. గత వారం కంటే ఈ వారంలో కొత్తగా నమోదైన కరోనా కేసులు గణనీయంగా తగ్గాయని.. గణాంకాలను చూస్తే.. కరోనా కేసులు 52 శాతం తగ్గాయని పేర్కొంది. బుధవారం 3.46 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వైరస్ బారిన పడి 3,365 మంది ప్రాణాలు కోల్పోయారు.

కరోనా వైరస్ ప్రభావం అమెరికాపై భారీగా పడింది. ఈ దేశంలో ఇప్పటివరకు 76 మిలియన్ల మందికి పైగా ప్రజలు కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. ప్రపంచంలో అత్యధికంగా అమెరికాలో కరోన బారిన పడ్డారు. ఇప్పటివరకు 9 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య కూడా అత్యధికం.

Leave A Reply

Your email address will not be published.