Breaking News

రోడ్డు వేయాలని అర్ధనగ్న ప్రదర్శన.

0 24

 విశాఖ:మా గ్రామానికి రోడ్డు వెయ్యాలి

 ఎన్నాళ్ళు మా గ్రామానికి డోలు మోతలు

మైనింగ్ వద్దు- రోడ్ ఏ కావాలి అంటూ

అజయ్ పురం ఆదివాసులు రెండు కిలోమీటర్ల దూరం అర్ధనగ్న గోసి కట్టి ప్రదర్శన, డోలీతో ఆందోళన.

అజయ్ పురం నుండి జడ్ జోగంపేట వరకు ప్రదర్శన.

విశాఖ జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ అజయ్ పురం గ్రామంలో 150 మంది ఆదివాసీ గిరిజనులు జీవనం సాగిస్తున్నారు.ఆ గ్రామస్తులు అందరూ కొన్ని సంవత్సరాల క్రితం ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్డు నిర్మాణం చేశారు.

తర్వాత కాలంలో గ్రానైట్ క్వారీలు వచ్చిన తర్వాత తమ గ్రామానికి రోడ్డు ఇస్తాం అని మాయమాటలు చెప్పి ఉన్న రోడ్డుని సర్వ నాశనం చేశారని వారు తెలిపారు.

 వర్షాకాలం సమయంలో నడవడానికి వీలు లేనట్టుగా కొండ గడ్డలో సెల ఏరులాగా పారుతాయి. 

ఆ గ్రామంలో జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా గర్భిణీలను డోలీ ఆధారంగా తమ జీవితాలను సాగిస్తున్నారు.

2018-19 సంవత్సరంలో stp నిధుల నుండి 90లక్షలు మంజూరయ్యాయి. రోడ్డు పనులు ప్రారంభించకపోవడంతో ఆ నిధులు వెనక్కి పోయాయి.

 గ్రానైట్ క్వారీలు వల్ల వచ్చిన నిధులు కూడా వెనక్కి పోతున్నాయని గ్రామస్తులు అన్నారు. 

                 డోలితో అర్ధనగ్న ప్రదర్శన

కళ్యాణపు లోవ రిజర్వాయర్ కి టూరిజం అభివృద్ధి చేస్తామని, కోట్ల రూపాయలు కేటాయిస్తామని అధికారులు, రాజకీయ నాయకులు ప్రకటన చేస్తున్నారని, తమ గ్రామాలకు రోడ్లు వేయడానికి మాత్రం శ్రద్ధ చూపించడం లేదని అన్నారు.

 మేము మనుషులమే నడవడానికి రోడ్డు కావాలి, ఎన్నాళ్ళు ఈ డోలు మోతలు తక్షణమే మాకు రోడ్డు మంజూరు చేయాలని గ్రామ పెద్ద పాంగి విజయ్ కుమార్,పాంగి చంద్రయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.