Breaking News

చందాలు వేసుకొని మట్టి రోడ్డు నిర్మించుకున్న గంగవరం గ్రామస్తులు.

0 19

 చందాలు వేసుకొని శ్రమ దానంతో మట్టి రోడ్డు నిర్మించుకున్న గంగవరం గ్రామస్తులు. 

వివరాల్లోకి వెళితే

విశాఖ జిల్లా,కొయ్యూరు మండలం, కొమ్మిక పంచాయితీ గంగవరం గ్రామస్తులు రోడ్ సౌకర్యం లేక అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆస్పత్రికి తీసుకొని వెళ్ళాలి  అంటే అడవి మార్గాన కాలినడకన డోలి మోతతో తీసుకొని వెళ్ళాలి.

గర్భిణీ స్త్రీలను తీసుకొని వెళ్ళాలన్నా అదే పరిస్తితి,కొంత మంది అడవి మద్య దారిలో డెలివరీ అయ్యారు.మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. 

ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలు తమ ప్రాంతానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తాయని ఎదురు చూసి విసిగి పోయిన గ్రామస్తులు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఒక్కో ఇంటికి 30 వేల రూపాయలు చందా వేసుకొని 3 కిలో మీటర్లు మేరా కొంత వరకు శ్రమదానం చేసి మరికొంత రాళ్ల ప్రాంతంలో జేసిబి పెట్టీ ఘాట్ రోడ్డు నిర్మించారు. 

మట్టి రోడ్ కావడంతో వర్సా కాలంలో అనేక ఇబ్బందులు పడుతున్నామని, చాలా సార్లు తమ ఊరికి రోడ్ సౌకర్యం కల్పించాలని ఎంపి, ఎం ఎల్ ఏ లకు, అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేశామని అయినా ఎవ్వరూ పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు కొమ్మిక నుండి తమ గ్రామం వరకు రోడ్ సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.