సహాయం చేసే హృదయం వుండాలే కానీ మనిషి ప్రత్యక్షంగా ఉండనవసరం లేదు అని దానికి మార్గం సహాయం చేసే మంచిమనస్సు ఉంటే చాలు అని నిరూపించారు.. విశాఖపట్నం జిల్లాకు చెందిన అతిమారుమూల మండలంమైన,G.K.వీధి మండలం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్.
తన Police Station పరిధిలో ఒక గ్రామమైన గుమ్మలా గొంది గ్రామం G.K. వీధి మండలంలో గల జర్త.హేమంత్(4y/M),S/O J. కన్నబాబు గారి చిన్నబాబుకు అతికొన్ని రోజుల్లో మలేరియా రావటం వెంటనే బాబు కిడ్నీలు పాడైపోవటం జరిగి అనారోగ్యం కారణంగా తల్లి, తండ్రి బంధుమిత్రుల సహాయంతో విశాఖపట్నం KGH హాస్పిటల్ ఎడ్మిట్ చేశారు.
07-02-2022న ఆ చిన్నబాబు తల్లి తండ్రులకు వక్తిగతంగా ఫోన్ చేసి నేను డ్యూటీలో వున్నాను ఇప్పుడు బాబు ఆరోగ్యం ఎలా ఉంది అని తన కుటుంబ సభ్యులకు బాధాకల్గితే ఎలా వుంటుందో అదేవిదంగా బాధపడి బాబు తొందరగా కోలుకోవాలని ఆ దేవుడికి ప్రార్థిస్తూ,బాబుకి తన చల్లని దీవెనలు అందిస్తూ,తన సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ దేవుడు బాబు ద్వారా ఆ తల్లితండ్రులకు కొంత ఆర్థిక సహాయం చేశారు. మరియు బాబు కోసం ఏ అవసరం వచ్చినా వెంటనే ఫోన్ చెయ్యాలని ఫోన్ నెంబర్ ఇచ్చి తన విశాల హృదయాన్ని తను పనిచేస్తున్న ప్రాంత వాసులపై తనకున్న ప్రేమను చాటుకున్న G.K వీధి, PS.CI అశోక్ గార్కి జై భీమ్ మిత్రుడు దుక్కేరి.ప్రభాకరావుతో పాటు జై భీమ్ పెద్దలు మరియు ఆదివాసీ పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు.