ఈరోజు 08.02.2022న పాడేరు శాసన సభ్యులు శ్రీమతి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి జి. మాడుగుల మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో గ్రామ సచివాలయ సిబ్బందికి యూనిఫార్మ్స్ మరియు సర్పంచులకు వారి వారి పంచాయితీలలో పారిశుధ్య నిర్వహణ కొరకు తడిచెత్త, పొడి చెత్త వేరు చేయుటకు డస్ట్ బిన్ లను అందజేశారు.ఈ కార్యక్రమంలో జి. మాడుగుల ఎమ్.పి.డి.ఓ,విస్తరణాధికారి, జి.మాడుగుల మండల పి.ఎ.సి.ఎస్ ఛైర్మన్ మత్స్య కొండబాబు,ఎమ్.పి.టి.సిలు, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రామకృష్ణ, వైస్ ఎంపిపి సత్యనారాయణ, మార్కెట్ యార్డు గాయత్రి, ఎంపీటీసీ సన్యాసిదొర,జి.మాడుగుల ఎంపీటీసీ విజయ, గెమ్మెలి సర్పంచ్ కొండబాబు,జి.మాడుగుల సర్పంచ్ రాంబాబు, వైసిపి నాయకులు ప్రశాంత్,ఆంద్రయ్య,కొండబాబు, చిట్టిబాబు,మసాడి గంగరాజు,
వంతల రమణ, కార్యకర్తలు పాల్గొన్నారు.