Breaking News

విషాదం… ఏడుగురు భారత సైనికులు మృతి.

0 20

 అరుణాచల్ ప్రదేశ్ లో హిమపాతంలో చిక్కుకొని గల్లంతైన ఏడుగురు సైనికుల ఘటన విషాదకరంగా ముగిసింది. ఏడుగురు జవాన్లు మృతి చెందినట్లు భారత సైన్యం నిర్ధారించింది. కమెంగ్ సెక్టార్ నుంచి వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఎత్తయిన ప్రాంతమైన కమెంగ్ సెక్టార్ లో ఆదివారం సైనికులు పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న సమయంలో హిమపాతం సంభవించిందని.. అందులోనే సైనికులు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. సమాచారం తెలియగానే రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దించి వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. తాజాగా వారి మృతదేహాలను గుర్తించినట్టు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.