Breaking News

జోరువానలో తడుస్తూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పాడేరు ఎమ్మెల్యే.

0 25

 అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం చీడిపాలెం సచివాలయం పరిధిలోని కాకరపాడు, ఐటిడిఏ కాలనీ, సింగవరం గ్రామాల్లో బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి హాజరయ్యారు.

మొత్తం 275 గడపలను ఆమె సందర్శించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలు ద్వారా అందించిన లబ్దిని ఘనాంకాలతో సహా వివరించారు.

ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేకి పలు సమస్యలను విన్నవించారు. ప్రజలు తెలియజేసిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్, జెడ్పిటిసి వారా నూకరాజు, ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు, వైస్ ఎంపీపీ అంబటి నూకాలమ్మ, స్థానిక సర్పంచ్ సోమన్న దొర,ఎంపీటీసీ పిల్లా గంగాభవాని, బీసీ డైరెక్టర్ గాడి నాగమణి, ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్, మండల కన్వీనర్ బండి సుధాకర్, మహిళా అధ్యక్షురాలు సడ్డా సావిత్రి,బూధరాళ్ళ సచివాలయ కన్వీనర్ కొర్రా తిరుపతిరావు,మండల నాయకులు వనుంబాబు, గజ్జయ్యదొర,పాటి శేఖర్, కోడా రాజబాబు, కొప్పు రమేష్, వైయస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.