Breaking News

మీ గుండెను ప్రేమించండి..పోస్టరును ఆవిష్కరించిన డిస్ట్రిక్ కలెక్టర్ డాక్టర్ ఏ. మల్లికార్జున ఐ.ఏ.ఎస్

0 23

 *మీ గుండెను ప్రేమించండి..!*


◆ ఈనెల 13న అను హాస్పిటల్స్ ఆధ్వర్యంలో 5కె వాక్


◆ పోస్టరును ఆవిష్కరించిన డిస్ట్రిక్ కలెక్టర్ డాక్టర్ ఏ. మల్లికార్జున ఐ.ఏ.ఎస్


◆ గుండె ఆరోగ్యంపై అను హాస్పిటల్స్ ప్రత్యేక కార్యక్రమాలు


*విశాఖపట్నం:* మీ గుండెను ప్రేమించండి! అనే థీమ్ తో అను హాస్పిటల్స్ వారు వినూత్నమైన కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఫిబ్రవరి మాసాన్ని మంత్ ఆఫ్ లవ్ గా జరుపుకుంటున్న నేపథ్యంలో లవ్ యువర్ హార్ట్ పేరుతో 5కె వాక్ నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈనెల 13న జరిగే ఈ 5కె వాక్ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్లను డిస్ట్రిక్ కలెక్టర్ డాక్టర్ ఏ. మల్లికార్జున ఐ.ఏ.ఎస్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా Collector మాట్లాడుతూ గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అను హాస్పిటల్స్ నిర్వహించనున్న 5కె వాక్ అభినందనీయమన్నారు. ప్రతిఒక్కరూ తమ గుండె సంరక్షణపై శ్రద్ధ వహించాలని, వైద్య నిపుణుల సూచనల మేరకు అవసరమైన జాగ్రత్తలను పాటించాలని సూచించారు. హృద్రోగాల బారినపడకుండా ఉండేందుకు తగినంత వ్యాయామం, క్రమబద్ధమైన జీవన విధానాలను అవలంభించాలని సూచించారు. దురలవాట్లకు దూరంగా వుంటూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ గుండెను ప్రేమిస్తూ, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆకాంక్షించారు. 13వ తేదీ ఉదయం గం.6.30లకు ఆర్.కె బీచ్ రోడ్డులో జరిగే ఈ 5కె వాక్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. మల్లికార్జున ఐఏఎస్ ,జీవీఎంసీ కమీషనర్ ,డాక్టర్ జి.లక్ష్మిష , అను హాస్పిటల్స్ ఛైర్మన్ జి. రమేష్ తదితరులు అతిధులుగా హాజరవుతారని అను హాస్పిటల్స్ సెంటర్ హెడ్ రమేష్ తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రమేష్ తో పాటు మార్కెటింగ్ హెడ్స్ సత్యవెంకట, ప్రసన్నకుమార్ ,మధుసూదన్,ఈశ్వర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.