Breaking News

సెల్ టవర్ ఏర్పాటు చేయాలని పీవో ని కోరిన కిముడుపల్లి గ్రామస్తులు.

0 18

 పాడేరు:కీముడుపల్లి పంచాయతీ కేంద్రంగా సెల్ టవర్ ఏర్పాటు చేయాలని

●పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని కలిసిన కీముడుపల్లి గ్రామస్తులు

పెదబయలు మండలం కీముడుపల్లి పంచాయతీ హెడ్ క్వార్టర్ కేంద్రంగా కీముడుపల్లి గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలని కీముడుపల్లి గ్రామస్తులు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీవో) రోణంకి గోపాలకృష్ణ గారికి వినతిపత్రం అందజేశారు. కీముడుపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ పంచాయతీ కేంద్రంగా సెల్ టవర్ లేక అనేక ఆన్లైన్ వర్కులకు 10 కిలోమీటర్లు ప్రయాణించవాల్సివస్తుందని అన్నారు.అలాగే పంచాయతీ కేంద్రంలో గ్రామ సచివాలయం మరియు ఒక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల,స్కూల్ కాంప్లెక్స్ మరియు ఈ ప్రాంతంలో చాలా మంది నిరుపేద విద్యార్థులు ఆన్లైన్ విద్యా విధానం ద్వారా రకరకాలైన క్రొత్త క్రొత్త సమాచారాన్ని తెలుసుకొనుటకు,అన్ని ప్రభుత్వ పథకాలు ఆన్లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకొనుటకు ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు అన్నారు.కాబట్టి కీముడుపల్లి పంచాయతీ హెడ్ క్వార్టర్ కేంద్రంగా సెల్ టవర్ ఏర్పాటు చేయాలని కీముడుపల్లి పంచాయతీ ప్రజలు కోరుతున్నారు.అలాగే కీముడుపల్లి సమీపంలో ఉన్న ఏండ్రిక్ పర్వతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేయాలని కీముడుపల్లి గ్రామస్తులు ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలకృష్ణ గారిని కోరారు.ఈ కార్యక్రమంలో కీముడుపల్లి వార్డు మెంబర్లు గడుగు కొండమ్మ,పలసి అప్పలమ్మ,ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు అంగనైని ఆనంద్,కోడా వరహనందం మాస్టర్,లకే సత్యనారాయణ పాత్రుడు,కె లక్ష్మణ్,ఎస్ మణికంఠ స్వామి తదితరులు పాల్గొన్నారు


.

Leave A Reply

Your email address will not be published.