Breaking News

జగనన్నకి ధన్యవాదాలు తెలుపుతూ వృద్ధులకు,మహిళలకి వస్త్రాలు పంపిణీ.

0 19

 కొత్త జిల్లాల పాలన ఉగాది నుంచి ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో.. జగనన్న కి ధన్యవాదములు తెలుపుతూ 27వ వార్డు వైఎస్సార్సీపీ నాయకులు జి.ఈశ్వర్ రెడ్డి, పెద్దరాజు, సిహెచ్ ఈశ్వర్ రెడ్డి(బాలుడు) ఆధ్వర్యంలో శనివారం ఉదయం దొండపర్తిలో రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ చేతులు మీదుగా వృద్ధులకు, మహిళలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ముందుగా ఎరుకుమాంబ ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సీతంరాజు సుధాకర్ పాల్గొని, అమ్మవారి ఆశీర్వాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 33వ వార్డు వైఎస్సార్సీపీ ఇంచార్జ్ పచ్చరపల్లి రాము, 27వ వైఎస్సార్సీపీ నాయకులు మద్ది సుధాకర్ రెడ్డి, కొల్లి రవీంద్రరెడ్డి, D. రమణ(Lic) , సదాశివుని ఈశ్వరరావు , కన్నారెడ్డి, గురివిందర్ రెడ్డి , కుమార్ రాజు, ప్రదీప్, లంక శ్రీను, వి.జయరాజారెడ్డి, Ch.సాయిరాం రెడ్డి, చిన్ని, చిరంజివి, పులి గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Leave A Reply

Your email address will not be published.