Breaking News

ఈనెల 11 నుండి 22వ తేదీ వరకు వీఆర్ఏ లు రిలే నిరాహారదీక్షలు.

0 18

 నెల్లూరు జిల్లా (గూడూరు మండలం)

గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం గూడూరు వారు 11వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరిగే వీఆర్ఏల రెండో రోజు రిలే నిరాహార దీక్షలు గూడూరు మండల తాహశీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకుల రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరిగినది.ఇందులో ప్రధాన డిమాండ్లు 1) వీఆర్ఏల జీతం 21000 ఇవ్వాలి 2) నామిని వీఆర్ఏ లను వి ఆర్ ఎ లు గా గుర్తించాలి 3) అర్హులైన వీఆర్ఏ లను వీఆర్వో గా గుర్తించాలి 4) ప్రభుత్వ సంక్షేమ పథకాలను వీఆర్ఏలు అర్హులుగా గుర్తించాలి.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు యాదగిరి, మణి, గ్రామ రెవెన్యూ సహాయకుల అధ్యక్షులు సమయాల రామయ్య, నీలి సుబ్బరామయ్య, గోవిందు వెంకట కృష్ణయ్య, పాలెపు రామయ్య,పాలచర్ల శ్రీనివాసులు జోగి వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.