Breaking News

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సెక్సన్ ఏపీ ట్రాన్స్కో లైన్మెన్.

0 17

 ఎస్ రాయవరం మండలం కొరుప్రోలు సెక్షన్ ఏపీ ట్రాన్స్ కో లైన్ మెన్ గా పనిచేస్తున్న ఎన్ నాగేశ్వరరావు శుక్రవారం ఎనిమిది వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి స్థానిక విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ రాయవరం మండలం గుర్రాజు పేట గ్రామానికి చెందిన దాట్ల కృష్ణంరాజు తన పొలంతో పాటు తన సోదరుడి పొలంలో రెండు బోర్లు కొట్టించుకున్నారు.

విద్యుత్ కనెక్షన్ కోసం వినియోగదారులు అడగగా లైన్ మెన్ నాగేశ్వరరావు ఎనిమిది వేల రూపాయల లంచం అడిగినట్లు డీఎస్పీ రమణమూర్తి చెప్పారు.

అయితే విద్యుత్ కనెక్షన్ వేసినప్పటికీ వినియోగదారులు డబ్బులు ఇవ్వకపోవడంతో పలుమార్లు లైన్మెన్ నాగేశ్వరరావు ఒత్తిడి చేసినట్లు చెప్పారు.

లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితులు తమను ఆశ్రయించడంతో శుక్రవారం అతని పొలంలో లైన్మెన్ నాగేశ్వరరావు రూ 8 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేశామని చెప్పారు. ఏసీబీ దాడులలో సీఐలు కృష్ణారావు,


గపూర్, ప్రేమ్ కుమార్,కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.