విశాఖ:అగ్నిప్రమాదంలో సుమారు లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం
నర్సీపట్నం వై జంక్షన్ పెట్రోల్ బంకు వెనుక భాగంలో వ్యవసాయ క్షేత్రంలో గల పశువుల పాకలో అగ్నిప్రమాదం జరిగింది. సుమారు లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని వ్యవసాయ పని ముట్లు, పైపులు తదితర వస్తువులు తగలబడిపోయినట్లు రైతు శెట్టి ముసలమ్మ తెలియజేశారు.ఆ సమయంలో పశువులు లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. ఘటనాస్థలానికి స్థానిక రెవెన్యూ అధికారులు చేరుకొని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. తెల్లవారుజామున తగలబడినట్లు స్థానికులు తెలియజేస్తున్నారు. జరిగిన ప్రమాదంలో నష్టాన్ని పై అధికారులకు తెలియజేస్తామని తెలియజేసారు.