Breaking News

చెట్టుపల్లి లో ఘనంగా పైడి తల్లి అమ్మ వారి పండుగ.

0 17

 


చెట్టుపల్లిలో ఘనంగా పైడి తల్లి అమ్మ వారి పండుగ


 నర్సీపట్నం: ఉదయం 6 గంటల నుండి గ్రామంలో ఉన్నటువంటి భక్తులు పసుపు కుంకుమలు సమర్పించుకున్నారు.

  ఉత్సవ కమిటీ వారు ఈ విధంగా తెలియజేశారు కొన్ని వందల సంవత్సరాలుగా ఈ పండుగను జరుపుతున్నామని కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అని ఈ పండుగకు ఈ 5 రోజులు ముందుగా పాల ఘటం చిన్న గుడి వద్ద ప్రజల సందర్శనార్థం డప్పు కళాకారుల ప్రదర్శనలతో పాటుగా పండుగకు మూడు రోజులు ముందుగా పెద్ద ఘట్టం పండుగ చేసే అనువంశిక కుటుంబీకులు అమ్మవారి ఘటాలతో గ్రామ పురవీధులలో ఊరేగించే పండుగ ముందు రోజు జాగరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామనిి, అంతేకాకుండా మరీ ముఖ్యంగా పండుగ రోజు మేళతాళాలతో డప్పు కళాకారుల తో మంగళ వాయిద్యాలతో తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం ఆలయ ధర్మకర్తల కుటుంబీకులు ఊరేగింపుగా వచ్చి పసుపు కుంకుమలు సమర్పించిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అమ్మవారి గర్భగుడిలోకి ప్రవేశం కల్పిస్తామని, మా గుడి యొక్క ప్రత్యేకత పూజారి లేకుండానే గర్భగుడి ప్రవేశంతో పాటుగా భక్తులు తమకు తామే పూజ చేసుకునే విధానం తరతరాలుగా వస్తున్న మ్రొక్కులు చెల్లించుకుని అమ్మ వారి కొరకు పాత్రులు అవడం అమ్మవారి కృపా కటాక్షం,గ్రామం పాడిపంటలతో వృద్ధి చెందాలని గ్రామంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని సాయంత్రం అమ్మవారిని నేల వ్యాసములు మంగళ వాయిద్యాలు అసభ్యకరమైన డ్యాన్సులు లేకుండా సాంప్రదాయబద్ధంగా పండుగ జరపడం ఆనవాయితీ అని అంతేకాకుండా ఉత్సవ కమిటీ వారు పండుగ రోజున దర్శనార్ధమై వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పులిహోర, లడ్డు, మజ్జిగ ప్రసాద వితరణ చేయడం జరుగుతుందని కమిటీ వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.